విధాత : ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆంగ్ల నామ సంవత్సరం 2026న్యూ ఇయర్ సంబరాలకు సిద్దమవుతున్నారు. భారత్ లోనూ ప్రజలు న్యూ ఇయర్ వేడుకల్లో తలమునకలేసే పనిలో ఉన్నారు. ఇదంతా నాణానికి ఓ వైపు. ఇంకోవైపు మాత్రం దేశానికి దేశానికి అన్నం పెట్టే అన్నదాత అగచాట్లు యూరియా క్యూ లైన్ల రూపంలో కంటతడి పెట్టిస్తున్నాయి. చలికి వణికిపోతూ..కుటుంబ సభ్యులతో కలిసి రైతులు యూరియా కోసం క్యూలైన్లలో కష్టాలు పడుతున్న దృశ్యాలు న్యూ ఇయర్ వేడుకల వేళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో బస్తా యూరియా కోసం రైతులు ఉదయాన్నే చలిలో నిద్రాహరాలు మాని ఎరువుల దుకాణాల ముందు క్యూ లైన్లలో బారులు తీరారు. ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాలోనే ఎరువుల కోసం రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే..రాష్ట్రంలోని మిగతా చోట్ల రైతుల పరిస్థితి ఏమిటంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రుల్లో ఒకరు డిప్యూటీ సీఎం..ఇంకొకరు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారని..అయినా కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇన్ని కష్టాలా అని బీఆర్ఎస్ విమర్శించింది. యాప్ పేరుతో డ్రామాలాడుతూ..రైతులను అరిగోస పెడుతున్న రైతుద్రోహి సీఎం రేవంత్ రెండి అని మండిపడింది.
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు
కాంగ్రెస్ పాలనలో ఇన్ని కష్టాలా?ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు..
అందులో ఒకరు డిప్యూటీ సీఎం..
ఇంకొకరు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి..ముగ్గురు మంత్రులున్న జిల్లాలోనే..
బస్తా యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందు
ఎముకలు కొరికే చలిలో.. నిద్రాహారాలు మాని… pic.twitter.com/0GtWbZ1P0t— BRS Party (@BRSparty) December 31, 2025
ఇవి కూడా చదవండి :
Jammu Kashmir : జమ్మూ కశ్మీర్ లో గ్రామ రక్షణ దళాలు..ఆర్మీ ట్రైనింగ్
Sridevi | అతిలోక సుందరి శ్రీదేవి.. తెర వెనుక తెలియని రేర్ ఫ్యాక్ట్స్, సంచలన ట్విస్టులు
