Beerla Ilaiah : పదవి..జీతం కోసం కేసీఆర్ సభకు వచ్చి వెళ్లాడు : బీర్ల ఐలయ్య

కేసీఆర్ కేవలం తన పదవిని కాపాడుకోవడానికి, జీతం కోసమే అసెంబ్లీకి వచ్చి వెళ్లారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు. దళిత స్పీకర్‌ను అధ్యక్షా అని అనలేక పారిపోయారని ఆరోపించారు.

Beerla Ilaiah

విధాత, హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ నెల జీతం కోసం, తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం అసెంబ్లీకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ విమర్శించారు. గత రెండేళ్లుగా కుంభకర్ణుడి మాదిరిగా ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ సార్..అసెంబ్లీకి వచ్చి..ప్రజా సమస్యలపై ఏదో మాట్లాడుతాడని అంతా అనుకున్నారన్నారు. అందుకు విరుద్దంగా కేసీఆర్ రిజిస్టర్ లో సంతకం చేసి..కనీసం చనిపోయిన సభ్యులకుసంతాప సందేశాలు కూడా పూర్తి కాకుండానే సభ నుంచి వెళ్లి పోయాడని మండిపడ్డారు.

దళిత స్పీకర్ ని ఎక్కడ అధ్యక్షా అని అనాల్సి వస్తుందో అని చెప్పి మైక్ అడగకుండా కేసీఆర్ వెళ్లిపోయాడని ఐలయ్య ఆరోపించారు. దళితులపై కేసీఆర్ కి ఎంత ప్రేమ ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో కేసీఆర్ సభకు వస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు తెగ హైప్ ఇచ్చారు అని.. తీరా చూస్తే రెండు నిమిషాలు కూడా సభలో లేడు అని ఎద్దేవా చేశారు. జీరో అవర్ లో 70మంది వరకు ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని, కేసీఆర్ తన గజ్వేల్ నియోజకవర్గం సమస్యలనైనా ప్రస్తావించకుండా వెళ్లిపోయాడని విమర్శించారు.

ఇవి కూడా చదవండి :

KTR : కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కలవడంపై కేటీఆర్ హాట్ కామెంట్స్
Srikanth | టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్‌కు ఈ స్టార్ నటి బంధువు అని మీకు తెలుసా?.. ఏం వ‌రుస అవుతుందంటే..!

Latest News