KCR| కేసీఆర్ సభకు వచ్చారు..వెళ్లారు!

తెలంగాణ అసెంబ్లీ శీతకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరై అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి రెండు నిమిషాల సభలో కూర్చుని వెళ్లిపోయారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతకాల(Telangana assembly winter sessions) సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సహా మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్(KCR) సభకు హాజరై అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి రెండు నిమిషాల సభలో కూర్చుని వెళ్లిపోయారు. తొలి రోజు సభలో దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు శాసనసభ సంతాపం తెలిపింది.

ఈ క్రమంలోనే కేసీఆర్‌ వద్దకు సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లి పలకరించి అభివాదం చేసి కరచాలనం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రేవంత్ రెడ్డి వాకబు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కేసీఆర్ తో కరచాలనం చేశారు. ఉత్తమ్ బలంగా షేక్ హ్యాండ్ ఇవ్వడంతో..కోపంతో ఇస్తున్నారా..ప్రేమతో ఇస్తున్నారా అంటూ కేసీఆర్ సరదాగా కామెంట్ చేశారు. అనంతరం రెండు నిమిషాల వ్యవధిలోనే సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్‌ సభ నుంచి వెళ్లిపోయారు. తిరిగి తన నందినగర్ నివాసానికి చేరుకున్నారు.

తొలి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సంతాప తీర్మానాల అనంతరం సభ వాయిదా వేస్తారన్న అంచనాలకు భిన్నంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ జీరో అవర్ చర్చ ప్రారంభించారు. సభ్యుల చర్చ అనంతరం సభ జవనరి 2వ తేదీకి వాయిదాపడింది.  మరోవైపు.. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Latest News