Site icon vidhaatha

ఆదాని-హిండెన్ బర్గ్ వ్యవహారంపై కమిటీకి కేంద్రం అంగీకారం

విధాత: ఆదాని-హిండెన్ బర్గ్ వ్యవహారంపై నిపుణుల కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకరించింది. నిపుణుల కమిటీ ఏర్పాటుకు సిద్ధమని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. మదుపు దారుల ప్రయోజనాలు కాపాడేందుకు కమిటీకి కేంద్రం అంగీకారం తెలిపిందని జనరల్ వెల్లడించారు.

పార్లమెంట్ సమావేశాల్లో ఆదాని హిండెన్ బర్గ్ వ్యవహారంపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం విదితమే. కేంద్రం నిపుణుల కమిటీకి అంగీకరించడంతో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విపక్షాలు కొంతమేరకు సఫలీకృతమైనట్లయింది.

Exit mobile version