Site icon vidhaatha

అదానీ – హిండెన్ బ‌ర్గ్ వివాదం.. సుప్రీంకోర్టు కీల‌క నిర్ణ‌యం

Adani | అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీల్డ్‌కవర్‌ సూచనలను ఒప్పకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఈ కేసులో ఏం జరుగుతున్నది? చేపట్టాల్సిన చర్యలు, మార్కెట్‌ జరుగుతున్నపరిస్థితులను అంచనాల వేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయంపై ఒక నిపుణుల కమిటీని తామే నియమించనున్నట్లు సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నర్సింహా. జస్టిస్‌ జేబీ పార్థివాలతో కూడిన ధర్మాసనం కీలకమైన ప్రకటన చేసింది.

పిటిషనర్ల తరఫున, ప్రభుత్వం తరఫున ఎవరి పేర్లను, సూచనలు, సలహాలు తాము తీసుకోబోమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీల్డ్‌ కవర్‌, దానికి సంబంధించిన మార్గదర్శకాల నివేదికను కూడా అంగీకరించడం తేల్చిచెప్పింది.

ఈ మొత్తం వ్యవహారంలో దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలన్నింటినిపైనా తీర్పును రిజర్వ్‌ చేసింది. తాము పూర్తి పారదర్శకంగా ఈ వ్యవహారం జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. కమిటీ నియామకంతో పాటు, నియమ నిబంధనలు అన్నీ కూడా పారదర్శకంగానే ఉండాలని, ప్రజల్లో కోర్టుల పట్ల విశ్వాసం సన్నగిల్లకుండా ఉండాలంటే తాము ఈ పని చేయాల్సిందేనని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషనర్లతో, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈ వ్యవహారానికి సంబంధించి నిపుణుల కమిటీని నియమించి తుది ఉత్తర్వులను ఇవ్వనున్నట్టు సీజేఐ ప్రకటించారు.

Exit mobile version