విధాత: గుజరాత్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకున్నది. ‘ఛల్లో షో’ చిత్రంలో నటించిన బాలనటుడు రాహుల్ (10) క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు.
“ఛల్లో షో” చిత్రం ఇటీవలే ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్నది. ఇంతలోనే ఈ విషాదం జరగడం గుజరాత్ చిత్ర పరిశ్రమను కలిచివేసింది.