కొడాలిపై నందమూరి అస్త్రం.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

విధాత‌: ఏదైనా పోరాటంలో తనకు శక్తి సరిపోదు అనిపించినప్పుడల్లా నందమూరి కుటుంబీకులను రంగంలోకి దించడం అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు తనమీద నిత్యం మాటల దాడి చేస్తున్న కొడాలి నాని మెరిడా కూడా నందమూరి కుటుంబం నుంచి ఒకరిని ప్రయోగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వీలు దొరికినప్పుడల్లా చంద్రబాబును, లోకేశ్‌ను నోటికొచ్చినట్లు తిట్టే కొడాలి నాని అంటే చంద్రబాబుకు చెప్పలేనంత ఆగ్రహం.. కోపం ఉంది. కానీ గుడివాడలో ఆయన్ను ఓడించడానికి టీడీపీకి ఉన్న శక్తి సరిపోవడం లేదు. మొన్నటి […]

  • Publish Date - December 9, 2022 / 04:34 PM IST

విధాత‌: ఏదైనా పోరాటంలో తనకు శక్తి సరిపోదు అనిపించినప్పుడల్లా నందమూరి కుటుంబీకులను రంగంలోకి దించడం అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు తనమీద నిత్యం మాటల దాడి చేస్తున్న కొడాలి నాని మెరిడా కూడా నందమూరి కుటుంబం నుంచి ఒకరిని ప్రయోగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వీలు దొరికినప్పుడల్లా చంద్రబాబును, లోకేశ్‌ను నోటికొచ్చినట్లు తిట్టే కొడాలి నాని అంటే చంద్రబాబుకు చెప్పలేనంత ఆగ్రహం.. కోపం ఉంది.

కానీ గుడివాడలో ఆయన్ను ఓడించడానికి టీడీపీకి ఉన్న శక్తి సరిపోవడం లేదు. మొన్నటి 2019 ఎన్నికల్లో నాని మీద పోటీ చేసిన దేవినేని అవినాష్ కూడా తరువాత వైసీపీలో చేరడంతో అక్కడ టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం అయింది. దీంతో అక్కడ ఎలా.. ఏమి చేయాలన్న దాని మీద బాగా యోచించిన చంద్రబాబు తన చివరి అస్త్రంగా నందమూరి కుటుంబం నుంచి ఒకరిని తీసుకొచ్చి పోటీకి ఒప్పించారని అంటున్నారు.

ఆ మధ్య హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కూడా సరైన అభ్యర్థి దొరకక పోవడంతో హరికృష్ణ కుమార్తె సుహాసినిని తీసుకొచ్చి పోటీ చేయించిన విషయం అందరికి తెలిసిందే. ఒకవేళ ఈ ఎన్నికలో గెలిచుంటే చంద్రబాబు తెలివి, చాణక్యం అని చెప్పుకునే వాళ్ళు కావచ్చు.

కానీ ఆ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలుపొందారు. ఇప్పుడు గుడివాడలో కూడా నాని మీద పోటీకి నందమూరి కుటుంబంలోని వ్యక్తిని దించుతున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణను ఇప్పటికే ఒప్పించారని అంటున్నారు.

ఆమధ్య చంద్రబాబు తన సతీమణి పైన వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ విలపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వైసీపీ నేతల మీద ఈ నందమూరి చైతన్య కృష్ణ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. వల్లభేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబుకు హెచ్చరికలు చేశాడు. ఇప్పుడు ఆయన్ను గుడివాడలో పోటీకి దించుతున్నట్లు చెబుతున్నారు. నాని దూకుడు ముందు ఈ చైతన్య నిలవగలడా.. గెలవగలడా.. లేదా అన్నది మున్ముందు తెలుస్తుంది.