చేపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువ‌కులు మృతి

కొండ‌గ‌ట్టు వెళ్తుండ‌గా ప్ర‌మాదం విధాత, నిజామాబాదు: నిజామాబాదు జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నందిపేట్ మండల కేంద్రానికి చెందిన ఉమ్మడి అశోక్, మంద మోహన్, రమేష్ మాదిగ కారులో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి బయలుదేరగా చేపూర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సమాచారం అందిన […]

  • Publish Date - December 10, 2022 / 01:44 PM IST
  • కొండ‌గ‌ట్టు వెళ్తుండ‌గా ప్ర‌మాదం

విధాత, నిజామాబాదు: నిజామాబాదు జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నందిపేట్ మండల కేంద్రానికి చెందిన ఉమ్మడి అశోక్, మంద మోహన్, రమేష్ మాదిగ కారులో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి బయలుదేరగా చేపూర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సమాచారం అందిన వెంటనే నందిపేట్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.