విధాత: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా 172 మంది లబ్ధిదారులకు 73లక్షల 18 వేల రూపాయల చెక్కులను జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథ , కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ వంటి పథకాలు తెచ్చి పేద, మధ్య తరగతి ప్రజల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నన్నారని తెలిపారు.
వేలాది మంది మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనందిస్తున్నట్టు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందజేస్తున్నామని తెలిపారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పూర్తి విశ్వాసం కల్పిస్తుందన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మంది పేదలకు నాణ్యమైన వైద్యనందించిన్నట్లు తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 5690 మంది లబ్ధిదారులకు 33 కోట్ల 29 లక్షల 18 వేల రూపాయలను సిఎం సహాయనిధి పంపిణీ చేశామని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వీ, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సవరాల సత్య నారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్, కరుణ శ్రీ, ఎంపిపిలు, నెమ్మాది బిక్షం, కుమారి బాబు నాయక్, రవీందర్ రెడ్డి, స్వర్ణ లత చంద్రా రెడ్డి, జడ్పీటిసి లు జీడి బిక్షం, మామిడి అనిత అంజయ్య,
సంజీవ నాయక్, కౌన్సిలర్లు కుంభం రేణుక రాజేందర్ , సుంకరి రమేష్, బత్తుల లక్ష్మీ జానీ, జ్యోతి శ్రీ కరుణాకర్, గండూరి కృపాకర్, బత్తుల ప్రసాద్, పిడమర్తి శంకర్, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగంధర్, తూడి నర్సింహ రావ్, వంగాల శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ లు నాతాల జానీకి రాం రెడ్డి, వెన్న సీతా రామ్ రెడ్డి, సర్పంచ్ లు , ఉప సర్పంచ్ లు, వార్డ్ అధ్యక్షులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.