CM Jagan | దసరాకు.. ఏపీ ఉద్యోగులకు డీఏ: సీఎం జగన్

ఎన్జీవో రాష్ట్ర మహాసభల్లో సీఎం జగన్ CM Jagan | విధాత: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పెండింగ్ డీఏ దసరా నాటికి ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఏపీ ఎన్ జీవో అసోసియేషన్ విజయవాడలో సోమవారం నిర్వహించిన 21వ రాష్ట్ర మహా సభలో సీఎం మాట్లడారు. ఉద్యోగుల ప్రయోజనాలు, వారికి మంచి చేసే విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనక్కు తగ్గే పరిస్థితి లేదని అన్నారు. 2 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, 2022 జూలై 1కి సంబంధించిన డీఏ […]

  • Publish Date - August 21, 2023 / 11:09 AM IST

  • ఎన్జీవో రాష్ట్ర మహాసభల్లో సీఎం జగన్

CM Jagan | విధాత: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పెండింగ్ డీఏ దసరా నాటికి ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఏపీ ఎన్ జీవో అసోసియేషన్ విజయవాడలో సోమవారం నిర్వహించిన 21వ రాష్ట్ర మహా సభలో సీఎం మాట్లడారు. ఉద్యోగుల ప్రయోజనాలు, వారికి మంచి చేసే విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనక్కు తగ్గే పరిస్థితి లేదని అన్నారు. 2 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, 2022 జూలై 1కి సంబంధించిన డీఏ దసరా పండుగనాడు అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీగా ఉంటోందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే 1.35 లక్షల నూతన ఉద్యోగాల భర్తీతో పనిభారం తగ్గించామని వివరించారు. టీడీపీ ప్రభుత్వం కనీసం ఊహించని ఆర్టీసీని తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో విలీనం చేసినట్లు తెలిపారు. చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే జీతాలు పెంచగా.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఉద్యోగులకు పెంచిన జీతాలు చెల్లిస్తోందని వివరించారు.

ఉద్యోగుల జీతాల ఖర్చు గతంలో రూ. 1,100 కోట్లు ఉండగా, నేడు రూ.3,300 కోట్లకు చేరిందని, అయినా ఉద్యోగుల కోసం చిరునవ్వుతో భరిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, గ్రామ స్వరాజ్య సాధనలో దేశానికే దిక్సూచిగా నిలిచిందని తమ ప్రభుత్వ సక్సెస్ కు కారణం ఉద్యోగులే అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.

Latest News