తుది ద‌శ‌కు స‌చివాల‌యం ప‌నులు.. ప‌రిశీలిస్తున్న సీఎం కేసీఆర్

విధాత: తుది ద‌శ‌కు చేరుకున్న తెలంగాణ నూత‌న స‌చివాల‌యం ప‌నుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిశీలిస్తున్నారు. వ‌చ్చే నెల 17వ తేదీన స‌చివాల‌యాన్ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో.. మిగిలిన ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని కేసీఆర్ ఇంజినీర్ల‌ను ఆదేశించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ఇంజినీర్లు ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు సీఎం కేసీఆర్ నూత‌న స‌చివాల‌యాన్ని ప‌రిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్ సూచ‌న‌ల‌కు అనుగుణంగా ఇంజినీర్లు మార్పులు చేశారు. ఆరో అంత‌స్తులో ఉన్న […]

  • Publish Date - January 24, 2023 / 10:13 AM IST

విధాత: తుది ద‌శ‌కు చేరుకున్న తెలంగాణ నూత‌న స‌చివాల‌యం ప‌నుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిశీలిస్తున్నారు. వ‌చ్చే నెల 17వ తేదీన స‌చివాల‌యాన్ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో.. మిగిలిన ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని కేసీఆర్ ఇంజినీర్ల‌ను ఆదేశించారు.

సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ఇంజినీర్లు ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు సీఎం కేసీఆర్ నూత‌న స‌చివాల‌యాన్ని ప‌రిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్ సూచ‌న‌ల‌కు అనుగుణంగా ఇంజినీర్లు మార్పులు చేశారు. ఆరో అంత‌స్తులో ఉన్న సీఎం కార్యాల‌యాన్ని కూడా కేసీఆర్ ప‌రిశీలించారు.

డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యాన్ని ఫిబ్ర‌వ‌రి 17వ తేదీన ఉద‌యం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. సెక్ర‌టేరియ‌ట్ ప్రారంభానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు.

స‌చివాల‌య ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌తో పాటు ఆయా రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖ నేత‌లు కూడా హాజరుకానున్నారు.