విధాత: దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. సరిగ్గా మధ్యాహ్నం 12:37 గంటల సమయంలో పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలోకి వెళ్లి తన గదిలో కేసీఆర్ ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో రేపు ప్రారంభించనున్న బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు. pic.twitter.com/y22IBIjXGn
— TRS Party (@trspartyonline) December 13, 2022
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Live : CM Sri K. Chandrashekhar Rao inaugurating Bharat Rashtra Samithi (BRS) office in New Delhi. https://t.co/CTJ0EYzxxi
— TRS Party (@trspartyonline) December 14, 2022
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కంటే ముందు.. రాజశ్యామల యాగం పూర్ణాహుతికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే.