Site icon vidhaatha

CM KCR | పంట నష్ట పరిహారం ఎకరానికి రూ.10 వేలు.. ఉత్తర్వులు జారీ

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన విపత్తుల నిర్వహణ శాఖ

విధాత: అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిహారం కౌలు రైతులకు కూడా ఇస్తామని ప్రభుత్వం తెలియచేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ (CM KCR) జిల్లాల పర్యటన అనంతరం విపత్తుల నిర్వహణ శాఖ కార్య దర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 17 నుంచి 21వ తేదీలలో కురిసిన వడగళ్ల వానంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. అనేక మంది రైతుల పొలాలు వడగళ్ల వాన బారిన పడి దెబ్బతిన్నాయి. మామిడి తోటలు, ఇతర పండ్ల తోటలు, యాసంగి వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో రైతులు, భూములు కౌలుకు చేసిన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు.

పంట తీవ్రతను అంచనా వేయడానికి గురువారం జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్‌ నష్టపోయిన పంటకు ఎకరాకు రూ. 10 వేలు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ విపత్తుల నిర్వహణ శాఖను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు విపత్తుల నిర్వహణ నిధి నుంచి ఒన్‌టైమ్‌ పరిహారం కింద నష్టపరిహారం ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version