విధాత: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా 14వ తేదీన ఢిల్లీలోని సర్దార్‌పటేట్ మార్గ్‌లో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమతి) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఇప్పటికే సర్దార్ పటేల్ రోడ్డులో ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ కార్యాలయ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ దగ్గరుండి చూసుకుంటున్నారు. రేపు కేసీఆర్ కూడా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీలో మంగళ, బుధవారాల్లో రాజశ్యామల యాగం నిర్వహించనున్నట్టు తెలిసింది.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. విమానం దిగి రాగానే ఆయనకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ తొలిసారిగా ఢిల్లీలో అడుగుపెట్టారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, సంతోష్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు.