యాదాద్రీశుడినీ ద‌ర్శించుకున్న ముగ్గురు సీఎంలు.. దర్శనానికి దూరంగా పినరై, రాజా

విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్ భగవంత్ సింగ్ మాన్,ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి యాదాద్రికి ప్ర‌త్యేక హెలికాప్టర్లో యాదాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రులకు కలెక్టర్ పమేలా సత్పతి స్వాగతం పలికారు. కొండపైన ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రులకు ఆలయ ఈవో గీత, అర్చక బృందం, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. […]

  • Publish Date - January 18, 2023 / 08:18 AM IST

విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్ భగవంత్ సింగ్ మాన్,ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి యాదాద్రికి ప్ర‌త్యేక హెలికాప్టర్లో యాదాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రులకు కలెక్టర్ పమేలా సత్పతి స్వాగతం పలికారు.

కొండపైన ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రులకు ఆలయ ఈవో గీత, అర్చక బృందం, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం వారికి అర్చక బృందం వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందించారు.

ఆలయాన్ని సందర్శించిన ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులకు ,మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లకు ఆలయ నిర్మాణ విశేషాలను సీఎం కేసీఆర్ స్వయంగా వివరించారు. అద్భుత శిల్పకళతో నిర్మితమైన యాదాద్రి ఆలయాన్ని చూసిన వారు కేసీఆర్‌ను అభినందించారు.

కాగా యాదాద్రికి వచ్చిన కేరళ సీఎం పినరాయి విజయన్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాలు స్వామి వారి దర్శనానికి దూరంగా ఉన్నారు, ప్రెసిడెంట్ సూట్ విశ్రాంతి గదిలోని ఉండిపోయారు. లక్ష్మీ నరసింహుడి దర్శనానంతరం వారంతా హెలికాఫ్టర్‌లో ఖమ్మం సభకు బయలుదేరి వెళ్లారు. ముఖ్య‌మంత్రుల వెంట ఎంపీ సంతోష్‌ కుమార్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితర నాయకులు ఉన్నారు.

Latest News