‘మన ఊరు.. మనబడి’ పనుల జాప్యంపై క‌లెక్ట‌ర్ సీరియ‌స్‌

త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని అధికారుల‌కు ఆదేశం విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో గురువారం దుబ్బాక నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకం కింద కేటాయుంచిన పాఠశాలల హెచ్ ఎం, ఎస్ఎంఎసి చైర్మన్లు, ఎంఈవో, ఎంపిడిఒ, ఎపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఏఈ, డిఈ లు మరియు సర్పంచ్, కౌన్సిలర్లు, నిర్మాణ ఏజెన్సీలతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం […]

  • Publish Date - December 8, 2022 / 01:42 PM IST
  • త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని అధికారుల‌కు ఆదేశం

విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో గురువారం దుబ్బాక నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకం కింద కేటాయుంచిన పాఠశాలల హెచ్ ఎం, ఎస్ఎంఎసి చైర్మన్లు, ఎంఈవో, ఎంపిడిఒ, ఎపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఏఈ, డిఈ లు మరియు సర్పంచ్, కౌన్సిలర్లు, నిర్మాణ ఏజెన్సీలతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ మాట్లాడుతూ…. చాలా సంవత్సరాల నుండి ఎలాంటి సదుపాయాల కు నోచుకోని ప్రభుత్వ పాఠశాలలను బాగుపర్చడానికి తీసుకువచ్చిన గొప్ప పథకం మన ఊరు మన బడి. జిల్లా మొత్తంలో దుబ్బాక నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకం పనులు సరిగ్గా లేనందున అసహనం వ్యక్తం చేశారు. పథకం లో ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, మేజర్ మైనర్ (కిటికీలు, డోర్లు, స్లాప్, ఫ్లోర్) రిపేర్లు తప్పని సరిగా వేగంగా పూర్తి చేసి కలరింగ్ కు నమోదు చేసుకోవాలి.

ఎన్ఆర్ఈజిఎస్, ఈజీఎస్ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్ షేడ్ పూర్తి చేశాకే మిగతా ప్రహరీ గోడ, అదనపు తరగతి గదులు పూర్తి చెయ్యాలి. ఎంపిడిఓ, ఎంపిఓ లు రోజు వారీగా పాఠశాలల్లో జరుగుతున్న ఈజీఎస్ పనులను పర్యవేక్షణ చేసి పూర్తి చేపించాలి. ఇప్పటి వరకు అయిన పనులకు తప్పనిసరిగా ఎప్టిఓ జనరేట్ చెయ్యాలని ఎఈ లకు తెలిపారు. ఎంఈవో, ఎంపిడిఒ, ఎఈ లు సమన్వయం తో పని చెయ్యాలి. పాఠశాల పేరును స్టిల్స్ కలర్ మాదిరిగా ఉండె బోర్డును ఏర్పాటు మరియు పథక అమలు ముందు తర్వాత ఎలా ఉంది అనేది ఫోటోలు తీసి ఆల్బమ్ ఏర్పాటు చేసుకోవాలని హెచ్ ఏం లకి తెలిపారు.

కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా డైనింగ్ హాల్ నిర్మాణం జరగట్లేదని హెచ్ ఏం లు అడగ్గా ప్రభుత్వ గైడ్ లెన్స్ ప్రకారం డైనింగ్ హల్ నిర్మాణం చేస్తున్నారు. కాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని మార్చడం కుదరదు. పిల్లల తరగతులు వారిగా భోజన సమాయాలను తయారు చేస్తాం అన్నారు. ఈ పథకం మీ పాఠశాలలకు కేటాయించినప్పుడే అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. కాని మళ్లీ విడతలో చేపిద్దాం అనే ఆలోచన దరిదాపుల్లో రాకుండా పని చేసుకోవాలని హెచ్ ఏం లకి సూచించారు. మళ్లీ విడత సమావేశం లోపు దాదాపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.