Site icon vidhaatha

త్వరలో అందుబాటులోకి.. డిజిటల్‌ రూపీ

విధాత: భార‌త డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల బ‌లోపేతం చేసేందుకు త్వ‌ర‌లోనే ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిమిత స్థాయి వినియోగానికి ఈ- రూపీని తీసుకొస్తున్న‌ట్లు ఆర్బీఐ ప్ర‌క‌టించింది. ఈ పైల‌ట్ ప్రాజెక్టును విస్త‌రిస్తున్న కొద్దీ సెంట్ర‌ల్ డిజిట‌ల్ క‌రెన్సీ ల‌క్ష‌ణాల‌ను, ప్ర‌యోజ‌నాలు తెలియ‌జేస్తామ‌ని పేర్కొన్న‌ది.

ఈ మేర‌కు శుక్ర‌వారం ఓ కాన్సెప్ట్ నోట్‌ విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌ క‌రెన్సీకి ఈ-రూపీ అద‌న‌పు వెసులుబాటు మాత్ర‌మేన‌ని ఆర్బీఐ కాన్సెప్ట్ నోట్‌లో పేర్కొన్న‌ది. బ్యాంకు నోట్ల‌తో పోలిస్తే ఇది ఏ మాత్రం భిన్న‌మైన‌ది కాద‌ని తెలిపింది.

కేవ‌లం డిజిట‌ల్ రూపంలో ఉండ‌ట‌మే దీని ప్ర‌త్యేక‌త అని వెల్ల‌డించింది. మ‌రింత సుల‌భంగా, వేగంగా, త‌క్కువ ఖ‌ర్చుతో లావాదేవీలు పూర్త‌వుతాయ‌ని తెలిపింది. ఇత‌ర డిజిట‌ల్ మ‌నీ త‌ర‌హాలోనే అన్ని లావాదేవీలు ఈ-రూపీకి ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది.

Exit mobile version