Site icon vidhaatha

KCR సంక నాకుతున్న కమ్యూనిస్టులకు సిగ్గులేదు: రాజ‌గోపాల్‌రెడ్డి

విధాత: రాష్ట్రంలో అవినీతి నియంతృత్వ కుటుంబ పాలన సాగిస్తున్నసీఎం కేసీఆర్ ప్రభుత్వాన్నిగద్దె దించడం బీజేపీకే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం భువనగిరిలో మీడియాతో ఆయ‌న‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీన పడడంతో కేసీఆర్‌ను గద్దె దించే లక్ష్యంతో తాను బీజేపీలో చేరానన్నారు .

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను రాష్ట్రంలో బలహీనపరిచి ఉనికి లేకుండా చేసింది కేసీఆర్ అని ఆరోపించారు. కమ్యూనిస్టులను తోక పార్టీ అన్న కేసీఆర్‌కు.. తమ రాజకీయ భవిష్యత్తు కోసం కేసీఆర్ సంక నాకుతున్న కమ్యూనిస్టులకు సిగ్గులేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ తుగ్లక్ ల వంటి వారని, ఎప్పుడు ఏం చేస్తారో ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదన్నారు. ముందస్తు ఎన్నికలకు పోతారో లేదో నిర్ణ‌యించుకునే ప‌రిస్థితిలో లేర‌ని విమ‌ర్శించారు.

ఎప్పుడైతే నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొని మా ప్రభుత్వాన్ని పడగొడుతుందని కేసీఆర్ అన్నారో ఆ ఘ‌ట‌నే సీఎం మతిస్థిమితం కోల్పోయాడ‌న‌డానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్న విషయంపై, మునుగోడు ఎన్నికలలో ప్రజలను డైవర్ట్ చేయడానికే ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయాన్ని ముందుకు తెచ్చారని ఆరోపించారు.

నిప్పు లేనిదే పొగ వస్తుందా అని, ఎలాంటి సంబంధం లేకుండానే కవితకు సీబీఐ నోటీసులు ఎందుకు ఇస్తుందన్నారు. కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసిఆర్ స్వార్థం కోసం అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వ‌జ‌మెత్తారు. రాబోవు రోజుల్లో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళుతుందని, కేంద్రం కేసీఆర్ కుటుంబ అవినీతి పై చర్యలు తీసుకుంటుందన్నారు.

Exit mobile version