విధాత, హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిదేనని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సింగల్‌బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ పరీక్షను మళ్లీ చేపట్టాలని టీఎస్‌పీఎస్సీ, రాష్ర్ట ప్రభుత్వానికి ఆదేశించింది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్ 16, 2022న మొదటిసారి నిర్వహిస్తే పేపర్ లీకేజీ కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో తిరిగి రెండో సారి జూన్ 11, 2023న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు.
కాగా ఈ పరీక్షకు 2,33,506 హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ తన వెబ్‌సైట్లో చెప్పింది. అయితే ఈ పరీక్షలో అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోలేదని, ఓఎమ్ఆర్ షీట్‌పైన అభ్యర్థుల ఫొటోలేకుండానే పలు అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చారని పేర్కొంటూ బి.ప్రశాంత్, జి. హరికృష్ణ, బండి ప్రశాంత్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మాధవిదేవి ధర్మాసనం విచారణ చేపట్టి పరీక్షలో పారదర్శకత పాటించలేదని పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోకుండా, ఓఎమ్ఆర్ షీట్‌పైన వారి ఫొటోలేకుండా పరీక్ష ఎలా రాయనిస్తారని, ఇది సరైంది కాదని పరీక్షను మళ్లీ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈనెల 23న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్షను రద్దుచేయకూడదని డివిజన్ బెంచ్‌కి అప్పీల్ వేశారు. 2.3 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే అందులో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని మిగిలిన వారు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తాలేరని పిటిషన్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈనెల 23వ తేదీన సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేసింది. దీంతో అప్పీల్‌ను కొట్టివేస్తు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ నిర్వహించే పరీక్షలో తప్పని సరిగా బయోమెట్రిక్ తీసుకోవాలని, పకడ్బందీగా జాగ్రత్తలు పాటించి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని, టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది.
వాదనలు ఇలా జరిగాయి..
వ్యవస్థసై నమ్మకంపోతుంది..
గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ వైఫల్యం కనిపిస్తున్నదని ధర్మసనం తెలిపింది. అక్టోబర్‌లో 2,83 లక్షలు మంది అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాశారని.. రెండోవ సారి 2.33 లక్షల మంది రాశారని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. మొదటి సరికి, రెండోవ సరికి 50 వేల మంది గ్రూప్-1 రాయలేదని స్పష్టంగా కనిపిస్తున్నదని హైకోర్టు చురుకుపెట్టింది. వ్యవస్థపై నమ్మకం కోల్పోవడంతోనే అభ్యర్థులు 50వేల మంది అభ్యర్థులు రెండోవ సారి పరీక్ష రాయలేదని వ్యాఖ్యానించింది. మొదటి సారి 2.85 లక్షల మందికి బయో మెట్రిక్ తీసుకునప్పుడు, రెండో సారి 2.33 లక్షల మందికి తీసుకోవడానికి ఏంటి ఇబ్బంది అని న్యాయస్థానం ప్రశ్నించింది.
పిటిషన్ వేసింది ముగ్గురు అభ్యర్థులని.. వారి కోసం కోసం మొత్తం పరీక్షను రద్దు చేయమనడం సమంజసం ఏజీ తెలుపగా.. పిటిషన్ వేసింది ముగ్గురు అభ్యర్థులే అయినా.. పరీక్ష నిర్వహణలో లోపలు మీకు కనిపిస్తలేవా అని ఏజీని ప్రశ్నించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు 2,33,506 మంది అని మీరే వెబ్‌సైట్లో పెట్టి, తిరిగి కౌంటర్ అఫిడవిట్‌లో మాత్రం 2,33,248 అని ఎలా చెప్తారు? అంత మీ ఇష్టమేనా.. 258 మంది అభ్యర్థులు ఎక్కువ ఎలా వచ్చారు? మరి దీనికి ఇప్పటివరకు సమాదామే చెప్పరేంటి అని హైకోర్టు మండిపడింది.
బయోమెట్రిక్ లేదని హాల్‌టికెట్‌లో ఉంది..
బయోమెట్రిక్ విధానం లేదని హాల్‌టికెట్‌ను సూచనలను పరిశీలిస్తే తెలుస్తుందని ఏజీ న్యాయస్థానికి గుర్తు చేయగా.. హాల్‌టికెట్ నోటిఫికేషన్ కాదని, నోటిఫికేషన్‌లో చెప్పి హాల్ టికెట్‌లో లేదని చెప్పడం ఏంటని వ్యాఖ్యానించింది. కీలకమైన పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించిన పరీక్ష ఇది ఇందులో ఎంపికైన వారు భవిష్యత్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌లు అయి విధాన రూపకల్పనలో భాగస్వాములు అవుతారని, వీరిలో తప్పుడు మార్గంలో ఎంపిన వ్యక్తులు ఉంటే పరిస్థితి ఏంటి? అని ధర్మసనం ప్రభుత్వానికి ప్రశ్నాల వర్షం కురిపించింది.
కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు..
అంతకుముందు ప్రత్యర్థి తరుఫు న్యాయవాది ఏ.గిరిధర్ రావు వాదనలు వినిపిస్తూ.. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో కనీస పకడ్బందీ జాగ్రత్తలు కూడా ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ తీసుకోలేదని న్యాయస్థానానికి తెలిపారు. మొదటిసారిగా పరీక్ష నిర్వహణలో తప్పు జరిగిందని తెలిసి కూడా రెండోసారి ఎలాంటి చర్యలు విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు.
బయోమెట్రిక్ విధానానికి రూ.1.5 కోట్ల ఖర్చుఅవుతుందన్న కారణంతో బయోమెట్రిక్ తీసుకోలేదని చెప్పడం సరైంది కాదని తెలిపారు. రాష్ర్టంలోని వివిధ మారుమూల గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన అభ్యర్థులు లక్షలు ఖర్చు పెట్టి, కోచింగ్ తీసుకొని పరీక్షరాస్తే.. టీఎస్‌పీఎస్సీ మాత్రం సరైన నిబంధనలు పాటించపోవడంతో వారంత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు.
ఖచ్చితంగా బయోమెట్రిక్ చేపట్టాలి..
ఈసారి నిర్వహించే పరీక్షలో ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానం చేపట్టాలని టీఎస్‌పీఎస్సీ, ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ను సరిగా నిర్వహించకపోవడంతో ఆరుగాలం కష్టపడిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదటిసారి నష్టం జరిగాక రెండో సారి అయిన జాగ్రత్తుల పాటించపోవడం ముమ్మటికీ మీ తప్పేఅని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇలాంటి తప్పిదాలు మళ్లీ పునరావృత్తం కాకుండా చూసుకునే బాధ్యత మీదే అని సూచించింది.
ఒకరి తరుఫునconduct Group-1 Prelims exam again.. High Court మరొకరు పరీక్ష రాసే అవకాశం ఉండొద్దనే కదా బయోమెట్రిక్ విధానం, బయోమెట్రిక్ లేకపోతే ఒకరి తరుఫున మరొకరు పరీక్ష రాస్తే ఏంటి పరిస్థితి.. అని వ్యాఖ్యానించింది. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పూర్తి పకడ్బందీగా పరీక్షను చేపట్టాలని, ఇలాంటి సమస్యలు మళ్లీ జరుగుతే సహించేది ఉండదాని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ మేరకు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ.. అప్పీల్‌ను కొట్టివేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.