Rahul Gandhi | మధ్యప్రదేశ్‌లో 150 స్థానాల్లో గెలుస్తాం: రాహుల్ గాంధీ

విధాత: మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఏఐసీసీ కార్యాయలంలో అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కర్ణాటకలో కలిసికట్టుగా పని చేసి 136 స్థానాల్లో గెలుపొందామని తెలిపారు. అదే తీరుగా మధ్య […]

  • Publish Date - May 29, 2023 / 10:51 AM IST

విధాత: మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఏఐసీసీ కార్యాయలంలో అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కర్ణాటకలో కలిసికట్టుగా పని చేసి 136 స్థానాల్లో గెలుపొందామని తెలిపారు. అదే తీరుగా మధ్య ప్రదేశ్‌లో అందరూ కలిసి కట్టుగా కష్టపడి పని చేస్తే 150 స్థానాల్లో గెలుస్తామని తెలిపారు. మధ్య ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర వ్యతిరకత ఉన్నదని తెలిపారు. ప్రజల మద్దతు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే ఉన్నదని, సమిష్టిగా కృషి చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.