Cool Drinks Van: రోడ్లపై మద్యం లోడో లారీలు..కోడిగుడ్లు..చేపలు, కోళ్ల లోడ్ లారీలు..అయిల్ ట్యాంకర్లు బోల్తాపడిన సందర్భాల్లో సమీప జనం తమకు అందిన కాడికి తీసుకుని అక్కడి నుంచి ఉడాయించడం చూస్తుంటాం. అయితే ఈ ధఫా కూల్ డ్రింక్ బాటిల్స్ తో వెలుతున్న వ్యాన్ బోల్తా కొట్టింది. ఇంకేముంది అసలే వేసవి ఎండల తీవ్రతతో అల్లాడుతున్న జనం ఇదే అదనుగా చేతికందిన కాడికి కూల్ డ్రింక్స్ బాటిల్స్ పట్టుకుని పండగా చేసుకున్నారు. ఈ ఘటన విజయవాడ – మచిలీపట్నం హైవే పై చోటుచేసుకుంది. రహదారిపై వెలుతున్న కూల్ డ్రింక్ వ్యాన్ టైర్ పేలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాన్ లో ఉన్న ముగ్గురికి గాయాలు అయ్యాయి.
వ్యాన్ బోల్తా పడిన ఘటనలో అందులోని కూల్ డ్రింక్ బాటిల్స్ రహదారిపై చెల్లచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసున్న స్థానికులు, ఆ మార్గంలో వెలుతున్న వాహనాదారులు తమ శక్తి మేరకు కూల్ డ్రింక్స్ బాటిల్స్ తీసుకుని వెళ్లిపోయారు. కొందరైతే సంచుల్లో, తమ వాహనాల్లో వేసుకుని మరి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.