Site icon vidhaatha

Drugs case | టాలీవుడ్ డ్రగ్స్ కేసులను కొట్టివేసిన కోర్టు

Drugs case | విధాత : సంచలనం సృష్టించిన టాలీవుడ్ నటుల డ్రగ్స్ కేసులను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. 2018లో టాలీవుడ్ నటీనటులు పలువురిపై 8కేసులు నమోదు చేయగా, సరైన సాక్ష్యాదారాలు లేవంటూ కోర్టు 6కేసులను కొట్టివేసింది. అప్పట్లో కేసుల విచారణకు ప్రభుత్వం సిట్ సైతం ఏర్పాటు చేసింది. అయితే డ్రగ్స్ కేసుల్లో ప్రొసిజర్స్ ఫాలో కాకపోవడంతో ఎక్సజ్ శాఖ కేసులు వీగిపోయాయని సమాచారం.


ఎఫ్‌ఎస్‌ల్ నివేదికలు పరిశీలించిన కోర్టు ఎలాంటి సాక్ష్యాదారాలు లేవని నిర్ధారించుకుని కేసులను కొట్టివేసింది. ఈ కేసులో నటీనటులను నెలల తరబడి విచారించిన ఎక్సైజ్ శాఖ, పలువురు నటీనటుల గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ కూడా తీసుకుని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. నటుడు తరుణ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ల శాంపిల్స్ మాత్రమే పరిశీలించిన ఎఫ్‌ఎస్‌ఎల్ వారి శరీరంలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని నివేదించింది. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా ఆరు కేసులను కోర్టు కొట్టివేసింది.

Exit mobile version