Site icon vidhaatha

COVID | వాస‌న, రుచి కోల్పోయిన 2 కోట్ల మంది అమెరిక‌న్లు

COVID |

కొవిడ్ (Covid) బారిన ప‌డిన అమెరిక‌న్ల‌లో 2 కోట్ల మంది వాస‌న, రుచి చూసే సామ‌ర్థ్యాన్ని తిరిగి పొంద‌లేక‌ పోయార‌ని ఓ అధ్య‌య‌నం (Study) వెల్ల‌డించింది. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా కొవిడ్ 19 సోకిన వారిలో చాలా మంది వాస‌న‌ (Smell), రుచి (Taste) సామ‌ర్థ్యాల‌ను కోల్పోయిన విష‌యం తెలిసిందే.

మ‌సాచుసెట్స్ ఐ అండ్ ఇయ‌ర్ ప‌రిశోధ‌కులు స‌మీక్ష అధ్య‌య‌నం చేయ‌గా.. మొత్తం కొవిడ్ బారిన ప‌డిన వారిలో 25 శాతం మంది ఇప్ప‌టికీ వాస‌న‌, రుచుల‌ను క‌నుగొన‌డంలో ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు అంచ‌నా వేశారు. సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ద‌గ్గ‌ర ఉన్న 29,696 న‌మూనాల‌ను అధ్య‌య‌న‌క‌ర్తుల విశ్లేషించారు.

వీరిలో 60 శాతం మంది వాస‌న చూసే శక్తిని, 58 శాతం మంది రుచి చూసే శ‌క్తిని పూర్తిగా కోల్పోయార‌ని గుర్తించారు. అంతే కాకుండా వీరిలో పూర్తిగా అంద‌రూ కొవిడ్ మునుప‌టి ప‌రిస్థితికి చేరుకోలేద‌ని క‌నుగొన్నారు. 72 శాతం మంది కొవిడ్ మునుప‌టి లాగే వాస‌న చూసే సామ‌ర్థ్యాన్ని తిరిగిపొంద‌గా.. 24 శాతం మంది పాక్షికంగా కోలుకున్నారు, మూడు శాతం మందికి వాస‌న చూసే సామ‌ర్థ్యం కొవిడ్ మునుప‌టి స్థాయికి చేరుకోలేదు.

రుచి చూసే సామ‌ర్థ్యంలో ఇది వ‌ర‌స‌గా.. 76 శాతం, 20 శాతం, 2 శాతంగా ఉంది. వాస‌నను గ్ర‌హించే శ‌క్తిని కోల్పోవ‌డంతో 22 కేజీలు త‌గ్గిపోయిన ఓ పేషెంట్‌ను చూసి ఈ అధ్య‌య‌నం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ప్రాజెక్ట్‌కు నేతృత్వం వ‌హించిన నీల్ భ‌ట్టాచార్య పేర్కొన్నారు.

‘ఆ పేషెంట్ ఏమీ తిన‌కుండా బ‌రువు కోల్పోయాడు. వాస‌న చూడ‌లేక‌పోతున్నాన‌ని పూర్తిగా డిప్రెష‌న్‌లోకి జారుకున్నాడు. మనం అంద‌రూ అనుకున్న‌ట్లు కొవిడ్ న‌య‌మైన అనంత‌రం అంద‌రూ మునుప‌టిలా మార‌లేదు. ఇప్ప‌టికీ చాలా మంది కొవిడ్ తీసుకొచ్చిన స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు’ అని పేర్కొన్నారు.

ఈ స‌ర్వేతో ఇలా ఎంత మంది బాధ‌ప‌డుతున్నారో నిర్దిష్టంగా కనుగొనే అవ‌కాశ‌ముంటుంద‌ని భ‌ట్టాచార్య పేర్కొన్నారు. కొవిడ్ సోకిన‌పుడు ల‌క్ష‌ణాల తీవ్ర‌త ఎలా ఉంద‌న్న దానిని బ‌ట్టి వాస‌న, రుచుల సామ‌ర్థ్యం ఆధార‌ప‌డి ఉంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. అప్పుడు ల‌క్ష‌ణాల తీవ్ర‌త ఎక్కువ ఉంటే ఈ రెండు అంశాల్లో తిరిగి కోలుకోవ‌డం క‌ష్టంగా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు

Exit mobile version