ఎమ్మెల్యే కొనుగోలు కేసు: కోట్ల‌ డీల్‌ చేశారు.. జమానత్‌కు లక్ష లేదంటున్నారు!

విధాత: ఎమ్మెల్యేల ఎర కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఒక్కొక్కరు ఇద్దరు వ్యక్తులతో జమానత్‌ ఇవ్వాలనీ, అలాగే మూడు లక్షల రూపాయల పూచి కత్తు సమర్పించాలనీ హైకోర్టు ఆదేశించింది. అయితే బెయిల్‌ మంజూరై రోజులు గడుస్తున్నా రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజీలు అవసరమైన మూడు లక్షలు చెల్లించటానికీ, వారి జమానత్‌ కోసం ఇద్దరు వ్యక్తులు ముందుకు రాకపోవటంతో వారింకా జైలులోనే ఉన్నారు! బీజేపీతో సహా అన్ని పార్టీల పెద్దలతో […]

  • Publish Date - December 3, 2022 / 08:34 AM IST

విధాత: ఎమ్మెల్యేల ఎర కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఒక్కొక్కరు ఇద్దరు వ్యక్తులతో జమానత్‌ ఇవ్వాలనీ, అలాగే మూడు లక్షల రూపాయల పూచి కత్తు సమర్పించాలనీ హైకోర్టు ఆదేశించింది.

అయితే బెయిల్‌ మంజూరై రోజులు గడుస్తున్నా రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజీలు అవసరమైన మూడు లక్షలు చెల్లించటానికీ, వారి జమానత్‌ కోసం ఇద్దరు వ్యక్తులు ముందుకు రాకపోవటంతో వారింకా జైలులోనే ఉన్నారు!

బీజేపీతో సహా అన్ని పార్టీల పెద్దలతో టచ్‌లో ఉంటూ ప్రత్యేక విమానాల్లో వారు దేశమంతా తిరుగుతారు, ప్రజాప్రతినిధుల కొనుగోలు కోసం కోట్ల రూపాయల బేరసారాలూ నడుపుతారు. అంతేగాక తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వీరి బెయిల్‌ కోసం దేశంలోనే అత్యధిక ఫీజు వసూలు చేసే లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు.

కానీ ప్రస్తుతం ఇలాంటి వారికి బెయిల్‌ కోసం వారు గానీ, వారి తరపు ప్రజా ప్రతినిధులు గానీ రూ.మూడు లక్షలు సమకూర్చలేక పోతుండడంతో ఇప్పుడు వాటిని తగ్గించాలని వీరి తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. కోట్ల రూపాయల డీల్‌లు నడిపే వారు లక్షల కోసం తంటాలు పడడం వెనక ఉద్దేశం ఏంటో అంతుపట్టడం లేదందటున్నారు దీన్ని చూసిన వారు.