విధాత: దైవజ్ఞ శిరోమణి, ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు శ్రీనండూరి గోవిందరాజు గారిచే అంత్యంత శాస్త్రీయంగా రూపొందించిన దిన, వార ఫలాలు నవీన పద్ధతుల్లో ప్రతి రోజూ, ప్రతివారం విధాత వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
ఆస్ట్రోరాజుగా ప్రఖ్యాతి పొందిన శ్రీ నండూరి గోవిందరాజుగారు ఈ నెల 23వ తేదీ, సోమవారం నుంచి ప్రతి రోజూ దిన ఫలాలు, ప్రతివారం వార ఫలాలు విధాత వెబ్‌సైట్ ద్వారా అందించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రముఖ కవి, రచయితగా పేరొందిన డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్య కుమారుడు శ్రీ గోవింద రాజు. తన తాత, తండ్రి వారసత్వంగా చిన్నప్పటినుంచి నేర్చుకున్న జ్యోతిష్య శాస్త్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో దశాబ్దాల కృషితో కంప్యూటరీకరించి మనకు అందించనున్నారు.
వరంగల్‌లోని అప్పటి ఆర్‌ఈసీ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులైన ఎన్‌జీ రాజు.. ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఎంటెక్ చేశారు. కేంద్ర రక్షణశాఖలో కీలక పదవులు నిర్వర్తించి, పదవీ విరమణ పొందారు. ఇన్‌ఫోటెక్, సైయెంట్ వంటి కంపెనీలకు వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు.
గడిచిన 50 ఏండ్లలో జ్యోతిష్య శాస్త్రంపై లోతైన పరిశోధన చేశారు. రాజకీయ, వ్యాపారరంగాల్లోని ప్రముఖులతోపాటు వివిధ వృత్తుల్లోని వారికి మార్గదర్శనం చేశారు. భవిష్యత్తును అంచనా వేయడంలో, వివాహాలకు జాతకాలు చూడటంలో, ముహూర్తాలు ఖరారు చేయడంలో దిట్టగా పేరొందారు. ఆయన పెట్టిన ముహూర్తానికి ఏ పని ప్రారంభించినా విజయం సాధించి తీరుతామన్న నమ్మకాన్ని ఎందరిలోనో కల్పించారు.
తనకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని, జ్యోతిష్యాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేసి, దానికి స్వయంగా సాఫ్ట్‌వేర్ రూపం ఇచ్చారు. పడికట్టు పదాలు కాకుండా సాధారణ ప్రజల భాషలో అర్థవంతంగా జ్యోతిష్యాలు అందిస్తున్నారు. అందుకోసం విజయానికి ఉన్న అవకాశాల శాతమెంత? ఇబ్బందుల శాతమెంత? అనేది శాస్త్రీయంగా వివరించే పద్ధతిని రూపొందించారు.
జాతకంలో స్కోరు 35శాతానికంటే తక్కువ వస్తే.. వైఫల్యంగా భావించాలని, 35%-55% మధ్య ఉంటే మోస్తరు విజయంగా భావించాలని, 55%-75% మధ్య వస్తే మంచి విజయంగా భావించాలని, 75శాతం పైగా వస్తే అద్భుత విజయంగా భావించాలని ఆయన ఒక పద్ధతిని రూపొందించారు.
ఆర్థిక, వృత్తిపరమైన, కుటుంబపరమైన లేదా ప్రేమ విషయాల్లో మీకున్న సమస్యలను పరిష్కరించడంలో, మీకు మార్గం చూపించడంలో ఆయన సహకరిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో ఆయన చేసిన కృషికి గాను దైవజ్ఞ రత్న, దైవజ్ఞ శిరోమణి పురస్కారాలతో పాటు అనేక అవార్డులు అందుకున్నారు. అనేక సన్మానాలు పొందారు.
చిరునామా
దైవజ్ఞ శిరోమణి నండూరి గోవిందరాజు, M Tech
ప్లాట్ నెంబర్ 423, రాజరాజేశ్వరి నగర్, కొండాపూర్, హైదరాబాద్ 500 084
ఈ మెయల్ : raju_astro@yahoo.com; govindrn@yahoo.com,
URL: www.astroraju.com,
ఫోన్ నంబర్లు: 9866115177 & 9440495887.