విధాత: ఏయిమ్స్, ఐసీఎంఆర్ సైబర్ దాడులు మరువక ముందే మరో దాడి గురించి వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 50లక్షల మంది డాటా దొంగిలించ బడినట్లు ప్రపంచంలోనే అతిపెద్ద నార్డ్ వీపీఎన్ సంస్థ తెలిపింది. అందులో 6 లక్షల మంది భారతీయులున్నట్లు తెలుస్తున్నది.
వీపీఎన్ పరిశోధనలో..
ప్రపంచంలోనే అతిపెద్ద అత్యాధునిక వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్)గా పేరుగాంచిన నార్డ్ వీపీఎన్ పరిశోధనలో ఈ విషంయ బయట పడింది. దొంగిలించ బడిన వాటిలో యూసర్ లాగిన్స్, కూకీస్, డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, స్రీన్ షాట్స్ ఇంకా ఇతర సమాచారం ఉన్నది.
ఖాతాదారుల విలువైన సమాచారం..
వర్చువల్ ప్రవేట్ నెట్‌వర్క్‌ను వినియోగించే ఖాతాదారులు తమ విలువైన సమాచారాన్నంతా సర్వర్‌లో భద్రపర్చుకుంటారు. అది వ్యక్తిగతమైనది కావొచ్చు, లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది కావచ్చు. ఇలాంటి సమాచారం తాను కాకుండా మరెవరూ చూడకుండా ఉండేందుకే వీటిలో దాచుకుంటారు. ఇలాంటి సమాచారం ఇతరులకు అందుబాటులోకి వెళితే.. దాంతో వారు ఎంతటికైనా తెగించవచ్చు. ఆర్థికంగానే గాకుండా, సామాజికంగా కూడా నష్టం చేకూర్చవచ్చు.