అనసూయ, రష్మీలను మించేలా మాల్దీవుల్లో దీపికా పిల్లి రచ్చ!

విధాత: ఒకనాడు సినిమాల్లో అవకాశం అంటే చాలా కష్టం. కానీ నేడు దానికి చాలా దారులు ఉన్నాయి. ముందుగా బుల్లితెర యాంకర్‌గా లేదా బుల్లితెర నటిగా నిరూపించుకుంటూ.. వెబ్ సిరీస్‌లు చేస్తూ టిక్ టాక్ షో వంటి ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా ఫేమస్ అవుతున్నారు.. వాటిల్లో రాణిస్తున్నారు. తద్వారా అందర్నీ ఆకర్షించి సినీ రంగానికి పూల బాట రెడీ చేసుకుంటున్నాను. ఇప్పటికే అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్, విష్ణుప్రియ, శ్రీముఖి చాలా మంది తాము […]

  • Publish Date - December 14, 2022 / 01:41 AM IST

విధాత: ఒకనాడు సినిమాల్లో అవకాశం అంటే చాలా కష్టం. కానీ నేడు దానికి చాలా దారులు ఉన్నాయి. ముందుగా బుల్లితెర యాంకర్‌గా లేదా బుల్లితెర నటిగా నిరూపించుకుంటూ.. వెబ్ సిరీస్‌లు చేస్తూ టిక్ టాక్ షో వంటి ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా ఫేమస్ అవుతున్నారు.. వాటిల్లో రాణిస్తున్నారు. తద్వారా అందర్నీ ఆకర్షించి సినీ రంగానికి పూల బాట రెడీ చేసుకుంటున్నాను. ఇప్పటికే అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్, విష్ణుప్రియ, శ్రీముఖి చాలా మంది తాము అనుకున్నది సాధించారు.

ఇప్పుడు అదే బాటలో నడుస్తోంది యాంకర్ దీపిక పిల్లి. సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన ఈమె సినిమాలు, టెలివిజన్ షోలలో ఆఫర్లు పట్టేసింది. టిక్ టాక్ స్టార్‌గా ఫేమస్ అయింది. టిక్ టాక్‌ను ఇండియాలో నిషేధించారు. ఈ పరిణామం దీపికాను దెబ్బతీసింది. అయినా ఆమెకు బుల్లితెర ఆఫర్స్ తలుపు తట్టాయి. ప్రముఖ షో అయిన ఢీ లో యాంకరింగ్ ఛాన్స్ కొట్టేసింది. తెలుగు పాపులర్ రియాల్టీ షో గా ఉన్న ఢీ సీజన్ 13 యాంకర్లలో దీపిక ఒకరు.

రష్మితో కలిసి ఢీలో సందడి చేసింది. రష్మీతో సుడిగాలి సుధీర్ రొమాన్స్ చేస్తే…. దీపికా పిల్లిని హైపర్ ఆది సెట్ చేసుకున్నాడు. వీరి మధ్య చాలా స్కిట్స్, రొమాంటిక్ సాంగ్స్ సెట్ చేశారు. వాటికి మంచి ఆదరణ లభించింది. కానీ అనూహ్యంగా డీ14 నుంచి ఆమెను తొలగించారు. ఇప్పుడు ఆమె ఆహాలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ పేరుతో కామెడీ షో చేస్తోంది. సుడిగాలి సుధీర్‌తో పాటు దీపికా పిల్లి దీనికి యాంకర్‌గా వ్యవహరిస్తోంది.

మరోవైపు ఈమెకు వెండితెర ఆఫర్స్ కూడా వస్తున్నాయి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో విడుదలైన ‘వాంటెడ్ పండుగాడు’ మూవీలో దీపికా పిల్లి నటించింది. ఇందులో దీపికా పిల్లి‌తో పాటు అనసూయ, విష్ణు ప్రియ వంటి వారు కూడా నటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం విజయం సాధించలేదు. ఇక ఈ మధ్య హీరోయిన్లకు, యాంకర్లకు విహారయాత్రలు ఎక్కువైన సంగతి తెలిసిందే. అనసూయ అస్తమానం.. తన ఫ్యామిలీతో ఏదో ఒక ప్రదేశం తిరిగి వస్తుంటుంది.

రష్మీ రీసెంట్‌గానే మాల్దీవుల్లో రచ్చ రచ్చ చేసి వచ్చింది. ఇప్పుడు దీపికా పిల్లి వంతొచ్చింది. ఆమె కూడా వారికి ఏం తక్కువ కాదనేలా హాట్ హాట్ ఫోజులను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. దీపికా తీరుకు సోషల్ మీడియాలో కుర్రాళ్ళు బేజారు అవుతున్నారు. పొట్టి బట్టల్లో స్కిన్ షో చేస్తూ టెంపరేచర్ పెంచేస్తోంది. మాల్దీవులలోని అందమైన సాగ‌ర తీరంలో బాగా ఎంజాయ్ చేస్తుంది. బికినీలు ధరించి జలకాలాటలాడుతోంది. ఎల్లో షార్ట్ ఫ్రాక్ ధరించి ఇసుకలో నాటీ (చిలిపి)ఫోజులతో ఓ ఫోటో షూట్ చేసింది. సదరు ఫోటోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రమ్‌లో వైరల్ అవుతున్నాయి.