Site icon vidhaatha

Brij Bhushan | 18న విచారణకు రండి.. బ్రిజ్‌భూషణ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

Brij Bhushan

న్యూఢిల్లీ: రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కేసులో బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌కు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. బ్రిజ్‌భూషణ్‌పై కేసు విచారించేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నది.

ఈ కేసులో దాఖలైన చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న అదనపు చీఫ్‌ మెట్రొపాలిటన్‌ మెజిస్ట్రేట్‌.. హర్జీత్‌ సింగ్‌ జస్పాల్‌.. ఈ నెల 18 తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు.

సస్పెన్షన్‌కు గురైన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ వినోద్‌ తోమర్‌కు కూడా సమన్లు జారీ చేసింది. ఆరు దఫాల ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు జూన్‌ 15న చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version