Site icon vidhaatha

Delhi liquor scam । హైదరాబాద్‌లో రెయిడ్‌ డిటర్జెంట్‌ పోస్టర్లు

విధాత : Delhi liquor scam | ఒకవైపు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత (K Kavitha)ను ఈడీ అధికారులు విచారిస్తుంటే.. మరోవైపు హైదరాబాద్‌లో ‘రెయిడ్‌ డిటర్జెంట్‌’ పేరుతో పోస్టర్లు వెలిశాయి. ఈడీ (Enforcement Directorate) తనిఖీలు జరిగి.. బీజేపీలో చేరగానే కేసులు ఎగిరిపోయిన పలువురు రాజకీయ నాయకుల ఫొటోలతో ఈ పోస్టర్లు ఉన్నాయి. ఒకవైపు ‘అసలైన రంగులు వెలిసిపోవు’ అంటూ కవిత ఫొటో ఉన్నది. కింద బైబై మోడీ హ్యాష్‌ ట్యాగ్‌ ఉంచారు. నగరంలోని పలు చోట్ల వీటిని బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాటు చేశాయి.

ఢిల్లీ లిక్కర్‌ కేసులో (Delhi liquor scam) ఈడీ అధికారులు కవితను ఢిల్లీలో ప్రశ్నిస్తున్న సమయంలో హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. ఈడీ సోదాలను ప్రస్తావిస్తూ.. ‘రెయిడ్‌ డిట్జెంట్‌ వాడితే తెల్ల చొక్కాలు కాషాయ రంగులోకి మారిపోతాయి.. కానీ.. కవిత దుస్తుల రంగు మాత్రం వెలిసిపోదు’ అనే అర్థం వచ్చేలా పోస్టర్లు రూపొందించారు.

Exit mobile version