Viral Video | దేశ రాజధాని ఢిల్లీలోని బాదర్‌పూర్ ఏరియాలో నిన్న రాత్రి దారుణం జరిగింది. ఓ 30 ఏండ్ల యువకుడిని మరో ముగ్గురు వ్యక్తులు అత్యంత దారుణంగా చంపారు. కర్రలు, కత్తితో దాడి చేసి హతమార్చారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన కేశవ్‌కు కోహినూర్, విక్కి అనే ఇద్దరు యువకులతో వారం రోజుల క్రితం గొడవ జరిగింది. అప్పట్నుంచే అతన్ని అంతమొందించాలని కోహినూర్, విక్కి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి బాదర్‌పూర్ ఏరియాలోని తాజ్‌పూర్ పహాడి ఏరియాలో కేశవ్‌ను కోహినూర్, విక్కితో పాటు ఓ మైనర్ కలిసి పట్టుకున్నారు.
అనంతరం కర్రలతో దాడి చేశారు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో కుప్పకూలిపోయారు. ఇక ఆ ముగ్గురు అక్కడ్నుంచి పరారీ అయ్యారు. స్థానికులు మాత్రం ఈ దాడిని అడ్డుకోలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
కేశవ్‌ను ఎయిమ్స్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కోహినూర్, విక్కిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉండగా, అతను మైనర్ అని తేలింది. అయితే కోహినూర్, విక్కితో పాటు కేశవ్‌కు నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
राजधानी दिल्ली में बदमाशो के हौसले बुलंद
ताजपुर पहाड़ी बाल्मिकी मौहल्ला में 30 वर्षीय काके नामक युवक की हत्या का सीसीटीवी आया सामने
बदरपुर थाना इलाका में अपराधियों को नही है किसी का डर pic.twitter.com/PFJUg7ZzQe— Lavely Bakshi (@lavelybakshi) December 21, 2022