భారత అథ్లెట్లకు చైనా వీసా నిరాకరణ.. పర్యటన రద్ధు చేసుకున్న కేంద్ర మంత్రి

విధాత : చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు హాజరుకావాల్సివున్న అరుణాచల్‌ప్రదేశ్ అథ్లెట్లకు అక్రిడేషన్ వీసాలను చైనా ప్రభుత్వం నిరాకరించడం వివాదస్పమైంది. చైనా చర్యపై భారత్ తన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన చైనా పర్యటనను రద్ధు చేసుకున్నారు.

అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్భీ స్పష్టం చేశారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా చైనా తమ దేశం అథ్లెట్ల పట్ల వ్యవహారించిన అనుచిత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తమదేశ అంతర్భాగమని వాదిస్తుండగా, ఇటీవల జీ20సదస్సు సందర్నంగా కూడా చైనా ప్రామాణిక మ్యాపుల పేరుతో అరుణాచల్ ప్రదేశ్‌, లడాక్ ప్రాంతాలను మ్యాప్‌లలో చూపకుండా వివాదం సృష్టించింది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లకు వీసా నిరాకరించడంతో రెండు దేశాల మధ్య మరో వివాదం రేగినట్లయ్యింది.