విధాత: మంత్రి జగదీశ్ రెడ్డి లేకుండా గత 20 ఏండ్లలో ఏ సభలో కూడా మాట్లాడలేదు. 2001 నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నోడు. నేను ఇక్కడకు వచ్చే ముందు బాధతో వచ్చాను. ఏం తప్పు చేసిండు జగదీశ్ రెడ్డి. ఎందుకు పంపించారు ఇక్కడ్నుంచి ఆయనను. ఎందుకు నిషేధించారు.
జగదీష్ రెడ్డిపై ఈ.సి చర్యలు దారుణం: సిఎం కేసీఆర్.
20 ఏళ్లలో ఏనాడూ జగదీష్ రెడ్డి లేకుండా ఏ సభకు నేను హాజరు కాలేదు.
జగదీష్ రెడ్డిని పంపించడం వెనుక కుట్ర దాగి వుంది. 3వ తేదీన కారు గుర్తు కు ఓటు వేసి కుట్రను తిప్పి కొట్టాలి.#MunugodeBypoll #MunugodeWithTRS #VoteForCar pic.twitter.com/6NMZTmSYBp
— K Prabhakar Reddy (@Koosukuntla_TRS) October 30, 2022
ఆయన గుండాగిరి చేసిండా? ఎవరినైనా కొట్టిండా? దౌర్జన్యం చేసినమా? అసలు టీఆర్ఎస్ పార్టీకి ఆ చరిత్ర ఉందా? వామపక్షాలకు ఆ చరిత్ర ఉందా? ఏం దౌర్జన్యం చేశామని? ప్రశాంత వాతావరణంలో మా ప్రచారం మేం చేసుకుంటున్నాం. ఈ రోజు ఆ బాధ ఉంది.
మీరు టీవీల్లో చూసింది గింతే.. మున్మందు ఢిల్లీ పీఠమే దుమ్ము రేగిపోద్ది: CM KCR