సోనియా గాంధీ జన్మదినం.. ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ

హైద‌రాబాద్‌లో చెక్కు పంపిణీ చేసిన రేవంత్‌రెడ్డి, జానారెడ్డి విధాత‌: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఇన్సూరెన్సు విభాగం చ‌నిపోయిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు చెక్కులు అందించే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అందులో భాగంగా హైదరాబాద్ బోయినపల్లి గాంధీ ఐడియాలాజీ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కుందూరి జానారెడ్డి చనిపొయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్‌ రెండు లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు […]

  • Publish Date - December 9, 2022 / 01:59 PM IST
  • హైద‌రాబాద్‌లో చెక్కు పంపిణీ చేసిన రేవంత్‌రెడ్డి, జానారెడ్డి

విధాత‌: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఇన్సూరెన్సు విభాగం చ‌నిపోయిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు చెక్కులు అందించే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అందులో భాగంగా హైదరాబాద్ బోయినపల్లి గాంధీ ఐడియాలాజీ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కుందూరి జానారెడ్డి చనిపొయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్‌ రెండు లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.

నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్, కాంగ్రెస్ పార్టీ పీఏ పల్లి నాయకులు ఏవి రెడ్డి ఆధ్వర్యంలో పీఏపల్లి మండల పరిధిలోని మేడారం గ్రామపంచాయతీ మధారి గూడెం గ్రామానికి చెందిన షేక్ జిలాని, మద్దిమడుగు విజయ కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్కులను అంద‌జేశారు.

కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వీరబోయిన ఎల్లయ్య యాదవ్, మాజీ ఎంపీపీ రాజమ్మ నారాయణ, అంగడి పేట సర్పంచ్ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ పాండు నాయక్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆమటీ శివ, అంతిరెడ్డి, భాస్కర్ రెడ్డి, సైదులు, సైదయ్య, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.