Site icon vidhaatha

Doctor Negligence | గుండె స‌ర్జ‌రీ త‌ర్వాత క‌డుపులోనే క‌త్తులు.. 12 రోజుల త‌ర్వాత రోగి మృతి

Doctor Negligence

విధాత‌: డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం వ‌ల్లే త‌మ తండ్రి చ‌నిపోయాడ‌ని ఓ కుమారుడు ఆరోపించాడు. హార్ట్ స‌ర్జ‌రీ చేసిన త‌ర్వాత‌.. శ‌రీరంలోనే సీజ‌ర్స్ వ‌దిలేశార‌ని, దాంతో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై త‌మ తండ్రి ప్రాణాలు కోల్పోయాడ‌ని పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌కు చెందిన ఉపేంద్ర శ‌ర్మ‌(74) ఈ ఏడాది మే 30వ తేదీన గుండెపోటుకు గుర‌య్యాడు. దీంతో అత‌న్ని కుటుంబ స‌భ్యులు హుటాహుటిన జైపూర్‌లోని ఫోర్టిస్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అదే రోజు అర్ధ‌రాత్రి ఒంటి గంట‌కు స‌ర్జ‌రీ నిర్వ‌హించారు.

మే 31న సాయంత్రం శ‌ర్మ‌ను డిశ్చార్జ్ చేశారు వైద్యులు. అయితే ఇంటికి వ‌చ్చిన రెండు రోజుల‌కే శ‌ర్మ మ‌రింత అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. ఆయ‌న కుమారుడు వైద్యుల‌ను సంప్ర‌దించ‌గా, రెండు, మూడు రోజుల్లో కోలుకుంటాడ‌ని తెలిపారు. మొత్తానికి జూన్ 12వ తేదీన తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు శ‌ర్మ‌. ఇక 15వ తేదీన అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఆ మ‌రుస‌టి రోజు.. తండ్రి అస్తిక‌ల‌ను తీసుకొచ్చేందుకు కుమారుడు శ్మ‌శాన‌వాటిక‌కు వెళ్లాడు. తండ్రి చితాభ‌స్మంలో రెండు సీజ‌ర్లు క‌నిపించాయి.

దీంతో ఆ కుటుంబం ఆస్ప‌త్రి యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేసింది. సీజ‌ర్స్‌ను కూడా చూపించింది. శ‌రీరంలోనే సీజ‌ర్స్ వ‌దిలేయ‌డం వ‌ల్ల త‌మ తండ్రి చ‌నిపోయాడ‌ని కుమారుడు ఆరోపించాడు. అత‌ని ఆరోప‌ణ‌ల‌ను ఆస్ప‌త్రి వైద్యులు కొట్టిపారేశారు.

చివ‌ర‌కు బాధిత కుటుంబ స‌భ్యులు జ‌వ‌హార్ స‌ర్కిల్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి ప్ర‌సాది లాల్ మీనా ఆధ‌ర్యంలో ఓ క‌మిటీని ఏర్పాటు చేశారు. శ‌ర్మ కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుపై క‌మిటీ ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ది.

Exit mobile version