Dr.Preethi |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ రెండవ సంవత్సరం చదువుతూ ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ ప్రీతి చెల్లెలు ధారావత్ పూజకి హెచ్ఎండిఏ లో కాంట్రాక్ట్ బేసిస్ లో ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక సంవత్సరం ప్రాతిపదిక మీద ఈ ఉద్యోగం కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రీతి మృతి సందర్భంగా వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఇచ్చిన హామీ మేరకు ఈ ఉద్యోగ అవకాశం కల్పించినట్లు భావిస్తున్నారు.