Site icon vidhaatha

ప్లాస్టిక్‌ కప్పుల్లో కాఫీ తాగుతున్నారా? అయితే మీ ప్రాణాలకు ముప్పే..?

విధాత: ఉదయం లేచింది మొదలు ఏదో ఓ సమయంలో అలవాటు ప్రకారం కాఫీ, టీలు తాగడం మనకు పరిపాటి. రోజుకు ఐదు నుంచి ఆరు సార్లు కూడా తాగే వారు ఉంటారు. మరికొందరైతే తాగినప్పుడల్లా పావు లీటర్‌ ప్లాస్టిక్‌ కప్పులో టీ, కాఫీ లాగిస్తూ ఉంటారు. అలా తాగకుంటే వారికి తాగినట్లు కూడా ఉండదు.

ఆ చెప్పుల ధర రూ. 9 వేలు.. మీరు ఓ లుక్కేయండి మరి..

అదేవిధంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత.. ఓ ఇద్దరు కలిస్తే చాలు టీ లేదా కాఫీ తాగేస్తుంటాం. అదేదో గాజు గ్లాసులో తాగుతామా? అంటే కానే కాదు. ప్లాస్టిక్ గ్లాసుల్లోనే టీ, కాఫీ తాగేస్తాం. తాగేయడమే కాదు.. కొన్ని సందర్భాల్లో పార్శిల్ కవర్లలో టీ, కాఫీలు తీసుకెళ్తుంటాం. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో పేపర్‌ కప్పులు వచ్చినా అందులోను కల్తీవి వచ్చేశాయి. బయటకి కలర్‌ఫుల్‌గా కనిపించినప్పటికీ అవి కూడా ఈ మధ్య నాణ్యత లేకుండా వస్తున్నాయి.

జాన్వీ అంత మాట అనేసిందేంటి?.. రష్మిక, విజయ్‌ బంధం గురించి తెలిసేనా!

అయితే.. ప్లాస్టిక్ కప్పుల్లో టీ, కాఫీ తాగడం, పార్శిల్ కవర్లలో తీసుకెళ్లి తాగడం చాలా ప్రమాదమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వారంలో ఒకసారి ప్లాస్టిక్ కప్పులో టీ లేదా కాఫీ తాగినా, లేదా పార్శిల్ కవర్లలో తీసుకెళ్లి తాగినా ఒక ఏడాది కాలంలో మీ శరీరంలోకి 90 వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు చేరిపోతాయని తాజా అధ్యయనంలో తేలింది.

వామ్మో.. ఈ భారీ ఆనకొండను చూస్తే వ‌ణుకు పుట్టాల్సిందే.. వీడియో వైర‌ల్

ఒక ఐదు నిమిషాల పాటు ఆ కప్పుల్లో వేడి ద్రవాలను ఉంచి పార్శిల్స్ తీసుకెళ్లినప్పుడు కుదుపుల వల్ల వాటి గోడల నుంచి 1500 ప్లాస్టిక్ కణాలు విడుదలవుతున్నట్లు చైనాలోని సిచువాన్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. పాలి ప్రొఫైలిన్‌, పాలిథిలీన్‌ టెరెఫ్తాలేట్‌, పాలిథిన్‌ కప్పుల్లో ఈ చర్యలు జరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

కిచ్చా సుదీప్‌తో హీరోయిన్ మీనా సీక్రెట్ మ్యారేజ్.. అసలు విషయం ఏంటంటే?

ఈ మైక్రో ప్లాస్టిక్‌ కణాలు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదమని హెచ్చరించారు. ఆ కణాలు మానవ కణాల్లోకి చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి ప్లాస్టిక్ కప్పులకు దూరంగా ఉండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.

క్యాన్సర్‌ను గుర్తించి.. బాలిక ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్

Exit mobile version