విధాత, హైదరాబాద్ : గత బీఆరెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్ష రాజకీయ ప్రముఖుల, అధికారుల ఫోన్ ట్యాపింగ్ నిర్వహించిన కేసులో డీఎస్పీ ప్రణిత్‌రావు కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ప్రణిత్‌రావును మంగళవారం రాత్రి సిరిసిల్లలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. ప్రణిత్‌రావు అరెస్టు కోసం ఆయన నివాసం వద్ద పోలీసులు మూడు రోజులు రెక్కి నిర్వహించి మరి అతడిని అరెస్టు చేశారు. విచారణలో ప్రణిత్‌రావు ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు ఆదేశించిన, సహకరించిన ఎస్‌ఐబీ అధికారుల పేర్లను వెల్లడించారని, దీంతో వారి అరెస్టుకు కూడా రంగం సిద్ధమైందని తెలుస్తుంది. డిఎస్పీ ప్రణిత్‌రావు కేసును సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులందరిని బయటకు లాగాలని సిట్‌ను ఆదేశించడంతో ఈ కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి డిఎస్పీ ప్రణిత్‌రావు ప్రభుత్వం మారగానే ట్యాపింగ్‌కు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో కేసుతో ప్రమేమయమున్న అధికారుల అరెస్టు తప్పదని తేలుతుంది.
ప్రణిత్‌రావు కేసు సిట్‌కు బదిలీ.. మాజీ అధికారుల అరెస్టుకు రంగం సిద్ధం
గత బీఆరెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్ష రాజకీయ ప్రముఖుల, అధికారుల ఫోన్ ట్యాపింగ్ నిర్వహించిన కేసులో డీఎస్పీ ప్రణిత్‌రావు కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది
Latest News

ముఖ్య నేత కోసమే జన్వాడలో ఇంటర్ ఛేంజ్?
దండోరా రివ్యూ: చావుకీ కులమడిగే వ్యవస్థపై మోగిన దండోరా
బాక్సింగ్ డే టెస్టులో హోరాహోరీ..ఒక్క రోజులోనే 20 వికెట్లు
కృష్ణా ప్రాజెక్టుల పెండింగ్.. నీళ్ల చుట్టూ పార్టీల కుర్చీలాట!
బెదిరింపు రాజకీయాలకు అడ్డ..తెలుగు రాష్ట్రాల రాజకీయం
పాపికొండల్లో పర్యాటకుల సందడి
2025 క్రిస్మస్కి బాక్సాఫీస్ దగ్గర చిన్న చిన్న సినిమాల సందడి…
బరాబర్ మా అయ్య పేరు చెప్పుకుంటా: కేటీఆర్
ఫారెస్టు ఆఫీసర్ పై అడవి పంది దాడి..వీడియో వైరల్
అనసూయ తగ్గేలా లేదుగా..