Nallamala forest fire| నల్లమలలో కార్చిచ్చు కలకలం

నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు కల్లోలం రేపుతుంది. అగ్ని జ్వాలలకు అడవీ దగ్దమవుతుండటం పర్యావరణ పరంగా ఆందోళన రేకేత్తిస్తుంది.

విధాత : నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు కల్లోలం రేపుతుంది. అగ్ని జ్వాలలకు అడవీ దగ్దమవుతుండటం పర్యావరణ పరంగా ఆందోళన రేకేత్తిస్తుంది. తాటిగుండాల సెక్షన్ పరిధిలో వజ్రాల మడుగు తవిసిపెంట, అక్క మహాదేవి గుహల వరకు వందల హెక్టార్లలో అడవి దగ్ధం అవుతుంది. బ్రహ్మగిరి రేంజ్ తాటిగుండాల సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు రాజుకున్నాయి.

శ్రీశైలం- హైదరాబాద్ దారి వెంబడి దాదాపు మూడు కిలోమీటర్లు పొడవున అడవిలో మంటలు విస్తరించాయి. మంటలు ఆర్పడటానికి అటవీ శాఖ, అగ్నిమాపక శాఖలు ప్రయత్నిస్తున్నాయి. గడ్డి ఏపుగా పెరగడం, కొండలు, లోయలు ఉన్న ప్రాంతం కావడంతో మంటలను అదుపు చేయడం సిబ్బందికి సవాల్ గా మారింది.

Latest News