EATALA RAJENDER | గోదావరి, ప్రాణహిత నదులతో పాటు వాగులపై కరకట్టలు నిర్మించాలి: ఈటల

EATALA RAJENDER | పోలాల్లో ఇసుక మేటలను ప్రభుత్వమే తొలగించాలి మానవ తప్పిదంతోనే మొరంచపల్లి ముంపు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: సీఎం కేసీఆర్ నిర్లక్ష్య ధోరణి, అనాలోచిత నిర్ణయాలతోనే రాష్ట్రంలో చిన్నపాటి వర్షాలకే వరదలు వస్తున్నాయని, వరదల కారణంగా పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో పంటలకు పనికి రాకుండా పోయాయని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే […]

  • Publish Date - July 31, 2023 / 02:58 PM IST

EATALA RAJENDER |

  • పోలాల్లో ఇసుక మేటలను ప్రభుత్వమే తొలగించాలి
  • మానవ తప్పిదంతోనే మొరంచపల్లి ముంపు
  • బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈటల రాజేందర్

విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: సీఎం కేసీఆర్ నిర్లక్ష్య ధోరణి, అనాలోచిత నిర్ణయాలతోనే రాష్ట్రంలో చిన్నపాటి వర్షాలకే వరదలు వస్తున్నాయని, వరదల కారణంగా పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో పంటలకు పనికి రాకుండా పోయాయని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామంలో వరదలకు కొట్టుకుపోయిన పంటలను బీజేపీ నాయకులు మహేశ్వర్ రెడ్డి, రాథోడ్ రమేష్ తో కలిసి ఈటల రాజేందర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప్రాజెక్టులకు, చెక్ డ్యాములకు వ్యతిరేకం కాదని, కడెం ప్రాజెక్టుకు మరిన్ని గేట్లు బిగించాలని జల వనరుల నిపుణుల కమిటీ సూచించినా ప్రభుత్వం పట్టించు కోలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమూలంగానే కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంత ప్రజలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వెళ్లారనితరలి వెళ్లారని, ప్రభుత్వం పునరావాస కేంద్రాలు తరలించి చేతులు దులుపుకున్నారని , స్వచ్ఛంద సంస్థలు ప్రతిపక్ష పార్టీలే ఆహార పదార్థాలు అందించారన్నారు.

గోదావరి, ప్రాణహిత, మానేరులతోపాటు వరదలు వచ్చే వాగులకు కరకట్టలు నిర్మించి, ముంపు ప్రాంతాల ప్రజలను కాపాడాలని పేర్కొన్నారు. ఇలాంటి వరదల సమయంలో నష్టపోయిన రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశపెట్టినా రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో అమలు కావడం లేదని అన్నారు. సదర్మాట్ కాలువ మూడు దిక్కుల గండిపడి 12వేల ఎకరాలల్లో రైతులుపంట పొలాలు నష్టపోయారని అన్నారు. వరదల మూలంగా రైతుల పంట పొలాలు వ్యవసాయానికి అక్కరకు రాకుండా ఇసుక మేటలు పెట్టాయని , భూమి కోతకు గురేందని ప్రభుత్వమే పూర్తి ఖర్చులు భరించి ఇసుక మేటలను తొలగించాలని డిమాండ్ చేశారు .

గత మూడు నాలుగు వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ అస్తవ్యస్తంగా మారాయన్నారు.
వరదల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు తక్షణ సహాయం కింద రూ. 25 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పైన మేడిగడ్డ , అన్నారం , సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం కోసం భూసేకరణకు కక్కుర్తి పడడంతోనే ఇవాళ ప్రతి వర్షాకాలం వేలాది ఎకరాల్లో పంట పొలాలు ముంపు గురై రైతులు నష్ట పోతున్నారని తెలిపారు .కొందరి భూములు ఊట బావులను తలపిస్తున్నాయన్నారు. మానవ తప్పిదం మూలంగానే మొరంచపల్లి ముంపు గురైందని, పెద్ద మొత్తంలో ప్రాణనష్టం , ఆస్తి నష్టం జరిగిందన్నారు . ఊరికి ఎగువ భాగంలో రెండు చెరువులు తెగుతాయని తెలిసి హెచ్చరికలు జారీ చేయక పోవడం మూలంగా నే ముంపుకు గురైందని తెలిపారు .