విధాత, వరంగల్: సీపీఎస్ ను రద్దుచేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్(TEA) ములుగు జిల్లా అధ్యక్షులు గుల్లగట్టు సంజీవ డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున భోజన విరామ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి సిపిఎస్ రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సంజీవ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పాలిట యమపాశంగా మారిన సీపీఎస్ ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, రాబోయే అసెంబ్లీ సమావేశాలలో సీపీఎస్ రద్దుకై బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఎస్ ని రద్దు కోసం అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలని ఒక తాటిపైకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి సీపీఎస్ రద్దు కోసం చేసే పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎం వీరస్వామి, బి సూరయ్య, బానయ్య, శశికాంత్, ముత్తయ్య, సమ్మయ్య, విజయ, లక్ష్మి, తేజస్విని తదితరులు పాల్గొన్నారు.