Site icon vidhaatha

చొక్కా విప్పేసి మరీ.. మరో మారు రెచ్చిపోయిన ఈషా రెబ్బా!

విధాత‌: తెలుగమ్మాయి ఈషా రెబ్బ అవకాశాల కోసం పరితపిస్తోంది. అందుకే ఆమె అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. తెలుగమ్మాయి ఈషా రెబ్బ‌కు అవకాశాలు కరువయ్యాయి. ఒకప్పుడు హీరోయిన్‌గా.. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్‌గా సత్తా చాటిన ఆమెకు.. ఇప్పుడు అసలు కాలం కలిసి రావడం లేదు. దీంతో వచ్చిన ఒకటి రెండు సినిమాలతో పాటు మరోవైపు వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తోంది.

ఇప్పటికే పిట్టకథలు, త్రీ రోజెస్ లాంటి వెబ్ సిరీస్‌లో మెరిసింది. నిజానికి ఈషా రెబ్బ అందంలో గాని, నటనలోగానీ ఓ స్టార్ హీరోయిన్‌కు ఏ మాత్రం తీసుపోదు. అయితే ఎందుకో ఆమెకు ఇంకా అదృష్టం కలిసి రావడం లేదు. బహుశా ఆమె తెలుగు అమ్మాయి కావడం ప్రధాన కారణం అయి ఉండొచ్చు.

అదే ముంబై లేదా చెన్నై అయితే అవకాశాలు వ‌రుస కట్టేవి. సినిమాల్లో తనకు వచ్చిన ప్రతి అవకాశం వదలకుండా నటిస్తూ మెప్పిస్తోంది. ఇది ఇలా ఉంటే.. ఆమె త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతుందంటూ కూడా ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ భామ ఓ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగానూ.. అది కూడా ఓ తమిళ ద‌ర్శ‌కుడ‌ని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావచ్చని అంటున్నారు. కానీ అది నిజమో కాదో తెలీదు. నిజానికి తెలుగు అమ్మాయిలు పరిశ్రమను ఏలి దశాబ్దాలు గడిచిపోతుంది.

విజయశాంతి, రమ్యకృష్ణ, రంభ, రోజాల‌తోనే ఆ వైభవం ముగిసింది. ముంబై హీరోయిన్స్ ట్రెండ్ మొదలయ్యాక దర్శకులు తెలుగు అమ్మాయిల ముఖం చూడటం లేదు. దర్శక నిర్మాతలకు పొరుగింటి పుల్ల కూరే రుచిగా మారుతుంది. నటన, భాష రాకపోయినా ఎదురు నేర్పించి మరి.. కోట్ల రూపాయలు రెమ్యూన‌రేష‌న్‌గా ఇస్తున్నారు.

అన్నీ తెలిసిన తెలుగమ్మాయిలు అర కొర డబ్బులకు చేస్తామన్నా కూడా నిర్మాతలు, దర్శకులు పట్టించుకోవడం లేదు. పొరుగింటి పుల్ల కూరే రుచి అంటున్నారు. కన్నడ, మలయాళ, తమిళ భామల‌కు ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా తెలుగు హీరోయిన్స్‌కి ఇవ్వడం లేదు.

దీంతో ఈషా రెబ్బలాంటి లోకల్ టాలెంట్‌కి ఆదరణ దక్కడం లేదు.. మాకేం తక్కువ కావాలంటే ముంబై భామల మాదిరిగా పొట్టి బట్టల్లో స్కిన్ షో కి కూడా సిద్ధమే అంటున్నారు. అయినా మీరు మాకొద్దని దర్శక నిర్మాతలు నేరుగా ముఖాన చెప్పేస్తున్నారు. ప్రాధాన్యం లేని సెకండ్ హీరోయిన్, కెరీర్‌కి ఉపయోగపడని వ్యాంప్ రోల్స్‌కే పరిమితం చేస్తున్నారు.

వరంగల్‌లో పుట్టిన ఈషా రెబ్బ కెరీర్ దాదాపు ముగిసినట్టే కనిపిస్తోంది. ఆమె టాలీవుడ్ వివక్షతకు బలై.. చేసేది లేక ఇతర పరిశ్రమలపై కన్నేసింది. ప్రస్తుతం తమిళంలో ఒక మూవీ చేస్తూ అక్కడ అదృష్టం పరీక్షించుకోనుంది. తెలుగులో ఆమె చేతిలో ఒక్క ఆఫర్ లేదు.

2021 లో విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ తర్వాత ఈషా స్క్రీన్ పై కనిపించలేదు. ఈ మూవీలో కూడా ఈశాది వ్యాంప్ పాత్రే. కెరీర్ బిగినింగ్‌లో ఇషాకు వ‌రుస అవకాశాలు వచ్చాయి. చిన్న, మధ్య తరహా చిత్రాలలో హీరోయిన్‌గా నటించారు.

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడైన శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో ఈషాను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు. కానీ హ్యాపీ డేస్ తరహాలో ఆ చిత్రం నటులకు బ్రేక్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె అంతకుముందు…. ఆ తర్వాత, అమీతుమీ ఆ….వంటి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాల్లో నటించింది.

ఎలాగైనా దర్శక నిర్మాతలను ఆకర్షించేందుకు మీడియా వేదికగా అందాల ప్రదర్శన చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. జిమ్ ఫిట్‌లో ఈషా టూ మచ్ హాట్‌గా కనిపిస్తోంది.

Exit mobile version