నిజామాబాద్ నగరంలో పేలుడు.. ఒకరికి గాయాలు

విధాత, నిజామాబాద్: నిజామాబాద్  నగరంలోని రెండో పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దబజార్‌లో శనివారం రాత్రి పేలుళ్లు సంభవించాయి. చెత్త సేకరించే వ్యక్తి ఒక డబ్బాను షేక్ చేయడం వల్ల అందులోని రసాయన పదార్థంతో పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో సమీపంలోని  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా పేలుడు ధాటికి సమీపంలోని షెడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సంఘటన స్థలాన్ని […]

  • Publish Date - December 11, 2022 / 05:23 AM IST

విధాత, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని రెండో పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దబజార్‌లో శనివారం రాత్రి పేలుళ్లు సంభవించాయి. చెత్త సేకరించే వ్యక్తి ఒక డబ్బాను షేక్ చేయడం వల్ల అందులోని రసాయన పదార్థంతో పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా పేలుడు ధాటికి సమీపంలోని షెడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సంఘటన స్థలాన్ని సీఐ విజయ్ బాబు, ఎస్ఐ పూర్ణేశ్వర్ సందర్శించారు.