Site icon vidhaatha

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మండవ


విధాత : బీఆరెస్‌ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతల ఆహ్వానం మేరకు మండవ కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. మండవ వెంకటేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నుంచి డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎక్సైజ్‌ శాఖ, విద్యా శాఖ, భారీ నీటిపారుదల శాఖల మంత్రిగా పని చేశారు.

Exit mobile version