NALGONDA: మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి కన్నుమూత

విధాత, నల్గొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి (65) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. 1985 లో నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లో దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు రాజీనామా అనంతరం.. ఆ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి రుద్రమదేవి విజయం సాధించారు. అతి చిన్న వయసులోనే ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించడం జిల్లా రాజకీయాల్లో విశేషంగా నిలిచింది. రుద్రమదేవి టిడిపిలో చాలాకాలం పాటు పనిచేశారు. రుద్రమదేవి మృతిపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ […]

  • Publish Date - December 13, 2022 / 01:30 AM IST

విధాత, నల్గొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి (65) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. 1985 లో నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లో దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు రాజీనామా అనంతరం.. ఆ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి రుద్రమదేవి విజయం సాధించారు.

అతి చిన్న వయసులోనే ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించడం జిల్లా రాజకీయాల్లో విశేషంగా నిలిచింది.
రుద్రమదేవి టిడిపిలో చాలాకాలం పాటు పనిచేశారు. రుద్రమదేవి మృతిపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా పలు పార్టీల రాజకీయ పనాయకులు తమ సంతాపం తెలిపారు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు రుద్రమదేవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఫోన్‌లో కుటుంబ సభ్యులను పరామర్శించారు.