Site icon vidhaatha

Boat Accident: గంగూలీ సోదరుడి కుటుంబానికి తప్పిన బోటు ప్రమాదం!

Boat Accident: : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సోదరుడు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ, ఆయన భార్య అర్పిత గంగూలీ ప్రయాణించిన స్పీడ్ బోట్ బోల్తా పడింది. పురీ తీరంలో సముద్రంలో వారి ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ అకస్మాత్తుగా తిరగబడటంతో వారు సముద్రంలో పడిపోయారు. ఈ సమయంలో అలల ఉదృతి అధికంగా ఉన్నప్పటికి లైఫ్‌ గార్డ్స్‌ సకాలంలో స్పందించి వెంటనే రంగంలోకి దిగి వారిని రక్షించారు. దీంతో స్నేహశీష్ దంపతులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

 

స్నేహశీష్, అర్పితలు బీచ్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌ యాక్టివిటీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదసమయంలో బోటులో నలుగురు మాత్రమే ఉన్నారు. సాధారణంగా బోటులో 10మంది ఉండాల్సి ఉంది. అయితే నిర్వాహకులు ఆదాయమే పరమావధిగా పర్యాటకుల ప్రాణాలు ఫణంగా పెట్టి తక్కువ మందితోనూ స్పీడ్ బోట్ లను అనుమతిస్తున్నారని అర్పిత ఆరోపించింది. ఇది ప్రమాదాలకు కారణమవుతుందని దీనిపై చర్చలు తీసుకోవాలని అర్పిత డిమాండ్ చేశారు. లైఫ్ గార్డ్సు లేకుంటే ఈ రోజు మేం ప్రాణాలతో బయటపడే వాళ్లం కాదని ఆమె తెలిపారు.

Exit mobile version