Accident | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు విద్యార్థులు మృతి

Accident | రంగారెడ్డి జిల్లా మోకిల పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని మీర్జాగూడ గేట్ వ‌ద్ద గురువారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది.

Accident | హైద‌రాబాద్ : రంగారెడ్డి జిల్లా మోకిల పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని మీర్జాగూడ గేట్ వ‌ద్ద గురువారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. అతివేగంతో వెళ్తున్న ఓ కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురిలో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

మృతుల్లో ముగ్గురు ఐసీఎఫ్ఏఐ యూనివ‌ర్సిటీ విద్యార్థులు కాగా, ఒక‌రు ఎంజీఐటీ విద్యార్థి. మృతుల‌ను సూర్య‌తేజ‌(బీబీఏ సెకండియ‌ర్), సుమిత్‌(బీబీఏ థ‌ర్డ్ ఇయ‌ర్), శ్రీ నిఖిల్‌(బీబీఏ థ‌ర్డ్ ఇయ‌ర్), రోహిత్‌(ఎంజీఐటీ విద్యార్థి) గా గుర్తించారు. గాయ‌ప‌డ్డ విద్యార్థిని న‌క్షత్ర‌(బీబీఏ థ‌ర్డ్ ఇయ‌ర్‌)గా గుర్తించారు.

అయితే వీరంతా స్పోర్ట్స్ కారులో అతివేగంగా ప్ర‌యాణిస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. మొద‌ట కారు డివైడ‌ర్‌ను ఢీకొట్టి ఆ త‌ర్వాత చెట్టుకు ఢీకొట్టిన‌ట్లు పేర్కొన్నారు. కారు నుజ్జునుజ్జు కాగా మృత‌దేహాలు వాహ‌నంలోనే ఇరుక్కుపోయాయి. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Latest News