Gold, Silver rates| స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి

బంగారం, వెండి ధరల అనిశ్చితి పర్వం కొనసాగుతుంది. గురవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 210తగ్గి.. రూ.1,61,680కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ.148,200కు దిగి వచ్చింది. కిలో వెండి ధర మాత్రం రూ.2,95,000వద్ద నిలకడగా కొనసాగుతుంది.

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరల అనిశ్చితి పర్వం కొనసాగుతుంది. గురవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 210తగ్గి.. రూ.1,61,680కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ.148,200కు దిగి వచ్చింది. కిలో వెండి ధర మాత్రం రూ.2,95,000వద్ద నిలకడగా కొనసాగుతుంది.

ఆల్ టైమ్ ధరల నుంచి..పడుతూ లేస్తున్న బంగారం, వెండి ధరలు

జనవరి 29వరకు ఆల్ టైమ్ రికార్డు ధరలను నమోదు చేసిన బంగారం, వెండి ధరలు ఆ తర్వాత అనూహ్యంగా తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా వెండి ధర రూ.4,25,000 రికార్డు ధర నుంచి భారీగా పతనమవుతు వచ్చింది. హెచ్చు తగ్గుల మధ్య ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,95,000వద్ద నిలిచింది. ఇకపోతే బంగారం రూ.1,78,250ల నుంచి దిగివచ్చినప్పటికి హెచ్చు తగ్గుల మధ్య ప్రస్తుతం తులం రూ.1,61,680వద్ద కొనసాగుతుంది.

అయితే అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక, రాజకీయ అస్ధిరతలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల నిర్ణయాలు, ఇరాన్ పై దాడికి సన్నాహాలు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల మార్పులు, డాలర్ విలువ మార్పులతో బంగారం, వెండి ధరలు భారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు సైతం బంగారం వంటి విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తున్నాయి.మొత్తం మీద భవిష్యత్తులో దీర్ఘకాలంలో బంగారం, వెండి ధరలు పుంజుకోవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు.

Latest News