Genelia | జెనీలియా ఏంటీ అంత మాట అనేసింది.. పిల్ల‌ల‌తో క‌లిసి ఆ పని చేయ‌లేక‌పోతున్నాం..!

Genelia | బొమ్మ‌రిల్లు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ జెనీలియా. ఈ చిత్రంలో హాసిని పాత్ర‌లో న‌టించి తెలుగింటి అమ్మాయిగా మారింది. తెలుగులో ప‌లు వైవిధ్య‌మైన చిత్రాల‌లో న‌టించిన జెనీలియా.. రానా సరసన నటించిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత టాలీవుడ్‌కి పూర్తిగా దూర‌మైంది. ఇక రితేష్‌ని ప్రేమ వివాహం చేసుకున్న జెనీలియా.. పెండ్లి తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితానికే ఎక్కువ సమయం కేటాయించింది. అయితే ఇటీవ‌ల త‌ను సినిమాలు వదిలేయ‌డం వ‌ల‌న […]

  • Publish Date - July 22, 2023 / 08:35 AM IST

Genelia |

బొమ్మ‌రిల్లు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ జెనీలియా. ఈ చిత్రంలో హాసిని పాత్ర‌లో న‌టించి తెలుగింటి అమ్మాయిగా మారింది. తెలుగులో ప‌లు వైవిధ్య‌మైన చిత్రాల‌లో న‌టించిన జెనీలియా.. రానా సరసన నటించిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత టాలీవుడ్‌కి పూర్తిగా దూర‌మైంది.

ఇక రితేష్‌ని ప్రేమ వివాహం చేసుకున్న జెనీలియా.. పెండ్లి తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితానికే ఎక్కువ సమయం కేటాయించింది. అయితే ఇటీవ‌ల త‌ను సినిమాలు వదిలేయ‌డం వ‌ల‌న ఏమైన బాధ‌ ఉందా అని అడ‌గ‌గా, దానికి స్పందిస్తూ.. జీవితంలో ఒకటి కావాలంటే మరొకటి వదిలేయాల్సిందే అని చెప్పుకొచ్చింది.

రెండు పడవల మీద ప్రయాణం అంత ఈజీగా ఉండ‌దు. పెండ్లయ్యాక నా వ్యక్తిగత జీవితానికి ఎక్కువ‌ సమయం కేటాయించా. సినిమాలు చేస్తూ ఇంటిని చూసుకోవడం కాలేదు. దాని వ‌ల‌న సినిమాలు వదిలేశా. ఇలా చేయడం వల్లే ఈ రోజు ఒక మంచి ఇల్లాలిగా కుటుంబంలో పేరు తెచ్చుకున్నాన‌ని చెప్పుకొచ్చింది.

మంచి క‌థ‌లు దొరికితే త‌ప్ప‌క సినిమాలు చేస్తున్నాను అని చెబుతున్న జెనీలియా ఇటీవ‌ల ఒక సినిమాకి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే తాజాగా జెనిలీయా ఓటీటీ సినిమాలు పిల్ల‌ల‌తో క‌లిసి చూసేలా లేవంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇటీవలి కాలంలో ఓటీటీలో వస్తున్న సినిమాలు కానీ వెబ్ సిరీస్ లో కానీ పిల్లలతో కలిసి చూసే విధంగా లేవ‌ని అంటుంది జెనీలియా. సినిమాలు కాని వెబ్ సిరీస్‌లు కాని ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా కంటెంట్ రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండే ట్రయల్‌ పీరియడ్‌ వెబ్ సిరీస్ తో మేం రాబోతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది జెనీలియా.

ఈ వెబ్ సిరీస్ జులై 21 నుంచి ఓటీటీ జియో సినిమా వేదికగా స్ర్టీమింగ్ కానుండ‌గా, మీడియాతో మాట్లాడిన జెనీలియా పలు విషయాలను తెలియచేశారు. సాధారణంగా నేను ఒక సినిమాకు కమిట్ కావాలంటే, ఆ క‌థ మొత్తం చదవటానికి చాలా సమయం తీసుకుంటాను కానీ ఈ వెబ్ సిరీస్ కేవలం గంటలోనే చదివి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాను అని తెలియ‌జేసింది.