ఘనపూర్ ప్రాజెక్టుకు జలకళ..!

సింగూర్ నుంచి 0.35 టీఎంసీ నీటి విడుదల సాగు కానున్న 22,651 ఎకరాలు.. 12 నుంచి 18 త‌డులకు నీటి విడుద‌ల‌ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు.. విధాత, మెదక్ బ్యూరో; మెదక్ జిల్లాలో ఏకైక మధ్యతరహా ప్రాజక్టు ఘనపూర్ ప్రాజెక్టు. ఆయకట్టు సాగు కోసం నీటిపారుదల శాఖ అధికారులు సింగూరు నుండి ఘనపూర్ ప్రాజెక్టుకు 0.35 టీఎంసీ నీటిని విడుదల చేశారు. దీంతో ఘనపూర్ ప్రాజెక్టుకు జల కళ సంతరించుకుంది. ప్రాజెక్టు కుడి, ఎడమకాలువల ద్వారా […]

  • Publish Date - January 16, 2023 / 11:40 AM IST
  • సింగూర్ నుంచి 0.35 టీఎంసీ నీటి విడుదల
  • సాగు కానున్న 22,651 ఎకరాలు..
  • 12 నుంచి 18 త‌డులకు నీటి విడుద‌ల‌
  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు..

విధాత, మెదక్ బ్యూరో; మెదక్ జిల్లాలో ఏకైక మధ్యతరహా ప్రాజక్టు ఘనపూర్ ప్రాజెక్టు. ఆయకట్టు సాగు కోసం నీటిపారుదల శాఖ అధికారులు సింగూరు నుండి ఘనపూర్ ప్రాజెక్టుకు 0.35 టీఎంసీ నీటిని విడుదల చేశారు. దీంతో ఘనపూర్ ప్రాజెక్టుకు జల కళ సంతరించుకుంది.

ప్రాజెక్టు కుడి, ఎడమకాలువల ద్వారా 22,651 ఎకరాలు సాగులోకి రానుంది. ఎగువ మంజీరా నిండి ఉండడంతో ప్రాజెక్టు ఆయకట్టు కింద 2 పంటలు పండుతున్నాయి. ఈ వ్యవసాయ సీజన్‌కు సంబంధించి నీటి పారుదల శాఖ అధికారులు 0.35 టీఎంసీల నీటిని 12 సార్లు విడుదల చేయనున్నారు.

ఈమేరకు జిల్లా కలెక్టర్ హరీష్ అధ్వర్యంలో సాగునీటి సలహా సంఘం అధ్వర్యంలో రైతులతో జరిగిన సమావేశంలో నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా నీటిపారుదల శాఖ ఎస్ ఈ యేసయ్య ఆదేశాల మేరకు సింగూర్ ప్రాజక్టు నుంచి ఘనపూర్ ప్రాజెక్టుకు 0.35 టిఎంసి నీటిని విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ మెదక్ డీఈ నాగరాజు తెలిపారు.

మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాలలోని కొల్చారo, మెదక్ నియోజక వర్గం మెదక్ టౌన్ తో పాటు, మెదక్ మండలం, హవేలీ ఘనపూర్ మండలం, పపాన్నపెట్ మండలాల పరిధిలో పంటలు పండనున్నాయి. పంటలు వేసింది మొదలు చివరి వరకు 12, లేదా 18 సార్లు పంట తడులకోసం సింగూరు ప్రాజెక్టు నుంచి, ఘనపూర్ ప్రాజెక్టుకు 0.35 టీఎంసీ నీటిని విడుదల చేయనున్నారు.

ఇందులో భాగంగా మొదటి విడుతగా ఘనపూర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో ఘనపూర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. సాగునీటి కోసం ఘనపూర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మంజీర నది తీరానికి వెళ్లొద్దు..

సింగూరు ప్రాజెక్టు నుండి ఘనపూర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడంతో పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ సుపరింటెండెంట్ ఇంజనీర్ యేసయ్య సూచించారు. చేపలు పట్టేందుకు జాలరులు మంజీర నదికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.