Gmail | గూగుల్‌ యూజర్లకు అలెర్ట్‌..! ఆ జీమెయిల్స్‌ను తొలగించనున్న కంపెనీ..!

Gmail | ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గూగుల్‌ జీమెయిల్‌ అకౌంట్‌ను వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్‌ యూజర్లు వినియోగిస్తున్న మెయిలింగ్‌ సర్వీసుల్లో జీమెయిల్‌లో మొదటిస్థానంలో ఉన్నది. అయితే, గూగుల్‌ జీమెయిల్స్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది. రెండేళ్లుగా వాడకుండా ఉన్న జీ మెయిల్‌ అకౌంట్స్‌ను డిలీట్‌ చేయనున్నట్లు ప్రకటించింది. అకౌంట్‌కు సంబంధించిన యూట్యూబ్, జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్ తదితర అన్ని అకౌంట్స్‌ను డిలీట్ చేయనున్నట్లు వెల్లడించింది. రెండేళ్లుగా సైన్‌ ఇన్‌ చేయని అకౌంట్లను చేయనుండగా.. ఈ ఏడాది […]

  • Publish Date - May 22, 2023 / 04:13 AM IST

Gmail |

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గూగుల్‌ జీమెయిల్‌ అకౌంట్‌ను వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్‌ యూజర్లు వినియోగిస్తున్న మెయిలింగ్‌ సర్వీసుల్లో జీమెయిల్‌లో మొదటిస్థానంలో ఉన్నది. అయితే, గూగుల్‌ జీమెయిల్స్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది. రెండేళ్లుగా వాడకుండా ఉన్న జీ మెయిల్‌ అకౌంట్స్‌ను డిలీట్‌ చేయనున్నట్లు ప్రకటించింది.

అకౌంట్‌కు సంబంధించిన యూట్యూబ్, జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్ తదితర అన్ని అకౌంట్స్‌ను డిలీట్ చేయనున్నట్లు వెల్లడించింది. రెండేళ్లుగా సైన్‌ ఇన్‌ చేయని అకౌంట్లను చేయనుండగా.. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఎవరైనా అవసరమున్న వారు ఆయా యూజర్స్‌ ఆయా అకౌంట్స్‌ను యాక్టివ్‌ చేసుకోవచ్చు. ఈ నిర్ణయంతో గూగుల్ అకౌంట్లకు భద్రత లభిస్తుందని, అకౌంట్లు దుర్వినియోగం కాకుండా ఉంటాయని కంపెనీ పేర్కొంది.

వాస్తవానికి రెండేళ్ల నుంచి వినియోగంలో లేని అకౌంట్లను డిలీట్‌ చేయనున్నట్లు గూగుల్‌ 2020 సంవత్సరంలోనే ప్రకటించింది. వాడుకలో లేని చాలా అకౌంట్లు తమ టు స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేయలేవు. దాంతో ఈ తరహా అకౌంట్స్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని, ఈ అకౌంట్స్ అవాంఛిత కంటెంట్ కలిగి ఉండటమో, స్పామ్ అయ్యే అవకాశం ఉంటుంది.

అయితే, అకౌంట్లను తొలగిస్తే ఇతర యూజర్లకు ఎలాంటి ప్రమాదం తప్పి.. భద్రత పెరుగుతుంది. ఇక జీమెయిల్స్‌ యూజర్లు తమ అకౌంట్లు డిలీట్‌ కాకుండా ఉండేందుకు వాటిని వినియోగంలోకి తీసుకురావాలి. అంటే లాగిన్ అయి, మెసేజ్ ఓపెన్, సెండ్ చేయాల్సి ఉంటుంది. గూగుల్‌ డ్రైవ్‌ వాడడంతో పాటు యూట్యూబ్ అకౌంట్‌తో లింక్ చేసి, వీడియో చూడాల్సి ఉంటుంది.

గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేయడంతో పాటు గూగుల్ సెర్చ్ వాడాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్స్‌ను గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవడంతో పాటు వీటిలో దేనిలో లాగిన్‌ అయినా అకౌంట్ సేఫ్‌గా ఉంటుంది. లేకపోతే డిలీట్‌ అయ్యే చాన్స్‌ ఉంటుంది. గూగుల్‌ ప్రస్తుతం గూగుల్‌ పర్సనల్‌ అకౌంట్లను మాత్రమే డిలీట్‌ చేయనున్నది.

ప్రైవేట్‌, బిజినెస్‌ అకౌంట్స్‌, ఆర్గనైజేషన్‌కు చెందిన అకౌంట్స్‌ను మాత్రం తొలగించడం లేదు. యూజర్లకు మెయిల్స్, మెసేజెస్ రూపంలో పంపుతూ ఉంటుంది. మెయిల్‌కు లింక్‌ అయిన ఫోన్లకు సమాచారం సైతం పంపుతుంది. అకౌంట్ తొలగింపునకు సంబంధించిన మెస్సేజ్‌ వస్తే అకౌంట్‌ను యాక్టివ్‌గా మార్చుకుంటే సరిపోతుంది.

Latest News